CSK: హార్దిక్ పాండ్యా కోసం సీఎస్కే మైండ్ గేమ్.. రేసులో 7 ఐపీఎల్ జట్లు!
CSK: ఐపీఎల్ వర్గాల నుంచి ఓ సంచలన వార్త క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ జట్టును వీడనున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే స్టార్ ఆల్‌రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ విండో ద్వారా తమ జట్టులోకి తెచ్చుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే హార్దిక్ పాండ్యా కోసం కేవలం సీఎస్కే మాత్రమే కాకుండా మరో 7 ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా ముంబై ఇండియన్స్ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతుండటం విశేషం.
హార్దిక్ పాండ్యాను దక్కించుకునే రేసులో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య అత్యంత బలమైన పోటీ నెలకొంది. వీరితో పాటు రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ రేసులో గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మాత్రం హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసే రేసులో ఆసక్తి చూపించడం లేదని సమాచారం. గతంలో 2015 నుంచి 2021 వరకు ముంబై జట్టుకు ఆడిన హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వెళ్లి ఐపీఎల్ కప్ గెలిచాడు. అనంతరం మళ్లీ ముంబై జట్టుకు కెప్టెన్ గా తిరిగి వచ్చినప్పటికీ.. అతని సారథ్యంలో ముంబై వరుసగా 10, 3, 9వ స్థానాలతో ఘోరంగా నిరాశపరిచింది.

మరోవైపు 32 ఏళ్ల హార్దిక్ పాండ్యా ప్రస్తుతం కండరాల గాయం కారణంగా ఇంగ్లాండ్ పర్యటనకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే తన ఫిట్‌నెస్, క్రికెట్ శిక్షణను మెరుగుపరుచుకోవడానికి ఆయన ముంబై నుంచి బెంగళూరుకు శాశ్వతంగా నివాసాన్ని మార్చాడు. ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతం నుంచి ప్రతిరోజూ ప్రాక్టీస్ కోసం ప్రయాణించడం కష్టంగా మారడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని బీసీసీఐ సరికొత్త నేషనల్ క్రికెట్ అకాడమీ కేంద్రమైన 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' సమీపంలో హార్దిక్ ఓ విలాసవంతమైన ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాడు కావడంతో.. గాయాల నిర్వహణ నుంచి నైపుణ్య శిక్షణ వరకు అన్ని సౌకర్యాలను హార్దిక్ పాండ్యా ఇక్కడ ఉచితంగా పొందవచ్చు. ఇకపై ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో బెంగళూరులోనే ఉండి తీవ్రంగా శ్రమించాలని హార్దిక్ నిర్ణయించుకున్నాడు. దీని ద్వారా బీసీసీఐ 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'ను తన శాశ్వత శిక్షణా కేంద్రంగా మార్చుకున్న మొదటి భారతీయ క్రికెటర్‌గా హార్దిక్ పాండ్యా రికార్డు సృష్టించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications