అసలు ఈ ట్వీట్ కథేంటీ..!
సీఎస్కే ఫ్రాంచైజీ తరఫున 2012 నుంచి 2022వరకు రవీంద్రా జడేజా ప్రాతినిధ్యం వహించాడు. అతను జట్టులో కీలక ప్లేయర్‌గా మారాడు. ఈ క్రమంలో దశాబ్దం పూర్తయిన సందర్భంగా సీఎస్కే ఫిబ్రవరిలో 10ఏళ్ల క్రితం నాటి జడేజా, ప్రస్తుత జడేజా ఫోటోలను పోస్టు చేసి '10 ఇయర్స్ ఆఫ్ సూపర్ జడ్డూ' అని క్యాప్షన్ ఇచ్చింది. ట్వీట్‌పై అప్పట్లో జడేజా స్పందిస్తూ.. 10 మోర్ టు గో (మరో పదేళ్లు ఆడతా) అంటూ కామెంట్ ట్వీట్ చేశాడు. దాన్ని ఇప్పుడు డిలీట్ చేశాడు. అంటే ఇక ఆడబోనని ఇన్నర్ మీనింగ్ అయి ఉండొచ్చు.
మీడియా ముందు కూడా దాటవేత ధోరణితో..
ఇటీవల అతను సీఎస్కేకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా బదులు ఇవ్వడం లేదు. వాటిని తోసిపుచ్చుతున్నాడు. తను ప్రస్తుతం టీమిండియా తరఫున ఆడుతున్నా కాబట్టి జట్టులో నా ప్రదర్శన ఎలా ఉండాలనేదానిపై మాత్రమే దృష్టి పెడుతున్నానని చెప్పాడు. ఇక సీఎస్కే విషయమై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. జడ్డూ సీఎస్కే మేనేజ్ మెంట్ వైఖరిపై అలిగినట్లు కన్పిస్తున్నాడు. గతంలో రైనాతో కూడా సీఎస్కే మేనేజ్ మెంట్ కాస్త దుందుడుకుగా వ్యవహరించింది. దీంతో ఒక సీజన్‌కు అతను దూరమయ్యాడు. ఇక ఏళ్లుగా సీఎస్కేకు ఎన్నో విజయాలందించిన రైనాను కనీసం వేలంలో బేస్ ప్రైజ్‌కు కూడా కొనకుండా 2022 మెగా వేలంలో తన కమర్షియల్ కోణాన్ని చూపించింది. అభిమానుల అండ చూసుకుని సీఎస్కే ధోనీ మినహా మిగతా ప్లేయర్ల విషయంలో కాస్త కఠినంగా ఉంటున్నట్లు కన్పిస్తోంది.
సీఎస్కే మాత్రం జడ్డూ తమతోనే అంటున్నా.. హింట్లు మాత్రం
ఇకపోతే ఐపీఎల్ 2022లో CSK కెప్టెన్‌గా తొలుత రవీంద్రాజడేజాను జట్టు యాజమాన్యం ఎంచుకుంది. కానీ జడేజా సారథ్యంలో జట్టు ఓటములను మూట గట్టుకుంది. జడేజా సైతం తన మార్క్ ప్రదర్శనను కొనసాగించలేకపోయాడు. అతను ఫామ్ కోల్పోయాడు. ఇక జట్టు మేనేజ్ మెంట్ ధోనీకి కెప్టెన్సీని తిరిగి అప్పగించింది. జడేజా తర్వాత గాయం కారణంగా డగౌట్లో కూర్చోవలసి వచ్చింది. ఇక సీజన్ మొత్తానికి కూడా దూరమయ్యాడు. ఇక ఆ తర్వాత జడ్డూ సీఎస్కేతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నాడు. జడ్డూ తమతోనే కొనసాగుతాడని సీఎస్కే పదే పదే క్లారిటీ ఇస్తున్నా అతను మాత్రం ఇక కొనసాగబోనన్నట్లు హింట్లు ఇస్తున్నాడు.
నెటిజన్ల వత్తాసు, అక్కసు
రవీంద్రా జడేజా తరుచుగా సీఎస్కేకు సంబంధించిన పోస్టులు డిలీట్ చేస్తుండడం పట్ల ఓ నెటిజన్ సీరియస్ అయ్యాడు. నువ్వు సీఎస్కేకు గుడ్ బై చెప్పాలనుకుంటే చెప్పు అంతే కానీ ఇలాంటి సిల్లీ తింగ్స్ చేసి ఎందుకు పరువును తగ్గించుకుంటావ్ అంటూ తిట్టిపోశాడు. మరో నెటిజన్ జడేజా కథ ముగిసింది. సీఎస్కేలోనే కాదు ఇండియాకు కూడా అవసరం లేదు.. బెంచ్ ప్లేయర్లు బొచ్చేడు మంది ఉన్నారు.. లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లో జడ్డూ పనైపోయింది. అని పేర్కొన్నాడు. ఇంకో నెటిజన్ సీఎస్కే మేనేజ్ మెంట్‌ను ఉద్దేశించి.. మీ మేనేజ్ మెంట్ వల్లే రైనా, జడ్డూకు ఈ పరిస్థితి వచ్చింది. అంతా ధోనీ కంట్రోల్లోనే ఉండాలనే మీ నైజం ఎంతవరకు కరెక్ట్ అంటూ క్వశ్చన్ చేశాడు. కొందరు మాత్రం జడ్డూ సీఎస్కేకు గుడ్ బై చెప్పడాన్ని తట్టుకోలేక హార్ట్ బ్రేక్ సింబల్స్ పెట్టి పోస్టు చేస్తున్నారు. ఇక సీఎస్కేలో జడ్డూ ఇన్ ఆర్ ఔట్ కథలో క్లైమాక్స్ ఏం జరుగుతుందో మరీ.


Click it and Unblock the Notifications
