For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK Squad 2022: చాహ‌ర్‌పై సీఎస్కే కోట్ల వ‌ర్షం! వారిని మ‌ళ్లీ కొనుగోలు.. ధోని పూర్తి జ‌ట్టు ఇదే

CSK Squad 2022: Check Out The Full Team of Chennai Super Kings After IPL 2022 Mega Auction
IPL Auction 2022 : Chennai Super Kings Complete Squad For IPL 2022 | Oneindia Telugu

బెంగ‌ళూరు: ఐపీఎల్ 2022 మెగా వేలం ముగియ‌డంతో క్రికెట్ అభిమ‌నులంతా ప్ర‌స్తుతం త‌మ ఫెవ‌రేట్ ఫ్రాంచైజీల‌పై దృష్టి సారించారు. త‌మ‌కు ఇష్ట‌మైన ఫ్రాంచైజీ ఎలా ఉంది, ఆట‌గాళ్ల‌వ‌రెవ‌రూ ఉన్నార‌ని ప‌రిశీలిస్తున్నారు. ఈ క్ర‌మంలో టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోని నాయ‌కత్వంలోని చెన్నైసూప‌ర్ కింగ్స్ జ‌ట్టు గురించి చ‌ర్చిస్తున్నారు. ఐపీఎల్‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన జ‌ట్టుగా పేరున్న చెన్నై జ‌ట్టు ఈ సారి ఎలా ఉంద‌ని ప‌రిశీలిస్తున్నారు.

సీఎస్కే మొత్తం జ‌ట్టు

సీఎస్కే మొత్తం జ‌ట్టు

ఈ సారి మెగా వేలంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ మొత్తం 21 మంది ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. అంత‌కుముందు రిటెన్ష‌న్ చేసుకున్న న‌లుగురు ఆట‌గాళ్ల‌ను క‌లుపుకుంటే ఆ జ‌ట్టులోని స‌భ్య‌లు సంఖ్య 25కు చేరుతుంది. ఇందులో ఎనిమిది మంది విదేశీ ఆట‌గాళ్లు ఉన్నారు. 48 కోట్ల‌తో మెగా వేలంలోకి వ‌చ్చిన ఆ జ‌ట్టు ద‌గ్గ‌ర‌ అంద‌రినీ ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేశాక 2.95 కోట్ల రూపాయ‌లు మిగిలాయి. అయితే ప్ర‌స్తుతం సీఎస్కే ఆట‌గాళ్ల‌ను చూస్తే గ‌తంలో మాదిరిగానే ఆ జ‌ట్టు బ‌లంగానే క‌నిపిస్తుంది.

కోట్ల రూపాయ‌ల‌తో వాళ్ల‌ను మ‌ళ్లీ కొనుగోలు

మెగా వేలంలో టీమిండియా యువ ఆల్‌రౌండ‌ర్ దీప‌క్ చాహ‌ర్‌పై చెన్నై సూప‌ర్ కింగ్స్ కోట్ల వ‌ర్షం కురిపించింద‌ని చెప్పుకోవాలి. గ‌తంలో దీప‌క్ త‌మ జ‌ట్టులోనే ఉన్న‌ప్ప‌టికీ వేలంలోకి వ‌దిలింది. వేలంలో 14 కోట్ల రూపాయ‌ల రికార్డు ధ‌ర పెట్టి కొనుగోలు చేసింది. అచ్చం అలాగే గ‌తంలో త‌మ జ‌ట్టుకే ఆడిన తెలుగు ఆట‌గాడు అంబటి రాయుడును రూ. 6.75 కోట్లు, వెస్టిండీస్ ఆల్‌రౌండ‌ర్‌ డ్వేన్ బ్రావోను రూ.4.40 కోట్లకు కొనుగోలు చేసింది.

 ఏ కేట‌గిరీలో ఎంత‌మంది

ఏ కేట‌గిరీలో ఎంత‌మంది

మొత్తంలో 25 మంది గ‌ల చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టులో 8 మంది విదేశీ ఆట‌గాళ్లు ఉన్నారు. బ్యాట‌ర్లుగా ధోనీ , రుతురాజ్‌, ఊతప్ప, రాయు డు, కాన్వే, సేనాపతి, నిషాంత్‌, జగదీశన్ ఉన్నారు. బౌల‌ర్లుగా దీపక్‌ చాహర్‌, ఆసిఫ్‌, తుషార్‌ దేశ్‌పాండే, తీక్షణ, సిమర్‌జీత్‌, మిల్నే, ముకేశ్‌ను ఆ జ‌ట్టు ఎంచుకుంది. జడేజా, బ్రావో, శివమ్‌ దూబే, హంగర్‌గేకర్‌, ప్రిటోరియస్‌, శాంట్నర్‌, ప్రశాంత్‌ సోలంకి, జోర్డాన్‌, భగత్‌ వర్మ, మొయిన్ అలీ ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో ఉన్నారు.

 సీఎస్కే పూర్తి జ‌ట్టు ఇదే

సీఎస్కే పూర్తి జ‌ట్టు ఇదే

మ‌హేంద్ర సింగ్‌ ధోనీ (12 కోట్లు), రవీంద్ర జడేజా(16 కోట్లు), మొయిన్‌ అలీ 8 కోట్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌( 6 కోట్లు), దీపక్‌ చాహర్‌( 14 కోట్లు), అంబటి రాయుడు(6.75 కోట్లు), డ్వేన్ బ్రావో (ఓవర్సీస్‌-4.40 కోట్లు), శివమ్ దూబే( 4 కోట్లు), క్రిస్‌ జొర్డాన్‌( 3.60 కోట్లు), రాబిన్ ఉతప్ప(2 కోట్లు), మిచెల్ సాంట్నర్ (ఓవర్సీస్ 1.90కోట్లు), ఆడమ్ మిల్నే (ఓవర్సీస్‌- 1.90 కోట్లు), విక్రమ్‌ సోలంకి(1.20 కోట్లు), రాజ్‌వర్థన్‌(1.50 కోట్లు), డేవన్‌ కాన్వే (ఓవర్సీస్‌- రూ. కోటి), మహీష్ తీక్షణ (ఓవర్సీస్ 70 లక్షలు), ప్రిటోరియస్ (ఓవర్సీస్ 50 లక్షలు), కేఎమ్‌ అసిఫ్, తుషార్‌ దేశ్‌పాండే, సిమర్‌జీత్‌ సింగ్, శుభ్రాన్ష్‌ సేనాపతి, ముకేశ్‌ చౌధరి, జగదీశన్‌, హరి నిషాంత్‌( వీరంద‌రికీ 20 లక్షలు)

Story first published: Monday, February 14, 2022, 13:56 [IST]
Other articles published on Feb 14, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+