Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018 కోసం వడివడిగా అడుగులేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్

CSK Set to Retain Dhoni, Raina, Jadeja; No Clarity on Ashwin

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ రానున్న పదకొండో ఐపీఎల్‌కు ఏర్పాట్లనీ సిద్ధం చేసేస్తుంది. ప్రతి ఫ్రాంచైజీ జనవరి 4వ తేదిలోపు తమ జట్టును ఖరారు చేసుకుని జాబితా విడుదల చేయాల్సి ఉంది. మిగిలిన ఆటగాళ్లను వేలానికి వాడుకునేందుకు అవకాశంగా ఈ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2018 సీజన్‌లో ఏ ఆటగాళ్లను తమ ఫ్రాంఛైజీలో కొనసాగించాలన్న దానిపై యాజమాన్యాలు కసరత్తులు చేస్తున్నాయి.

మామూలుగానే ఆటగాళ్లతో 10 సీజన్ల ఒప్పందం ముగియడంతో 11వ సీజన్‌కు అందరూ వేలంలోకి ప్రవేశించాలి. కానీ, ఫ్రాంఛైజీ యాజమాన్యం ముగ్గురు లేదా ఐదుగురు ఆటగాళ్లను తమ వద్దే ఉంచుకునేటట్లు ఐపీఎల్ నిర్వహక సంఘాన్ని అభ్యర్థిందించింది. ఈ ప్రతిపాదనపై చర్చించిన ఐపీఎల్‌ నిర్వాహకులు ముగ్గురు ఆటగాళ్లను మినహాయించి మరో ఇద్దరికి రైట్‌ టు మ్యాచ్‌ కార్డ్స్‌ ద్వారా అవకాశం ఇస్తామని తెలిపారు.

చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమైనట్లే..
ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం చెన్నై సూపర్‌కింగ్స్ కసరత్తులు మొదలుపెట్టింది. అందులో భాగంగా ధోనీ, రైనా, జడేజాలను రిటేన్ చేసుకోవాలని భావిస్తున్నది. అయితే సీనియర్ స్పిన్నర్ అశ్విన్ తీసుకోవడంపై ఏటూ తేల్చుకోలేకపోతున్నది.

ఇప్పటివరకు రిటేన్ జాబితాను లీగ్ నిర్వాహకులకు అందజేయలేదని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోను రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా తీసుకుంటున్నట్లు సమాచారం. భారత జట్టు యువ క్రీడాకారుడు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ పేరును కూడా ఈ విషయమై పరిశీలనలోకి తీసుకున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 23, 2017, 12:14 [IST]
Other articles published on Dec 23, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+