సీఎస్‌కేకు ధోనీ గుడ్‌బై.. నెటిజన్‌పై మండిపడ్డ చెన్నై!!

IPL 2020 Auction : CSK's Savage Response To Claims About Releasing MS Dhoni Ahead Of IPL 2020
CSK response to claims about releasing MS Dhoni ahead of IPL 2020

చెన్నై: భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్‌కే) సారధి మహేంద్రసింగ్‌ ధోనీపై రూమర్ సృష్టించిన ఓ నెటిజన్‌పై చెన్నై యాజమాన్యం మండిపడింది. విషయంలోకి వెళితే... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్‌కు రంగం సిద్దమవుతోంది. నవంబర్‌ 15న ఫ్రాంచైజీల ట్రేడింగ్‌ విండో ముగిసింది. అట్టి పెట్టుకున్న, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలను ఫ్రాంచైజీలు వెల్లడించాయి.

సహచర ఆటగాడిపై దాడి: బంగ్లా బౌలర్‌పై ఐదేళ్ల నిషేధం.. 3లక్షల టాకాల జరిమానా!!

సీఎస్‌కేకి ధోనీ గుడ్‌బై:

సీఎస్‌కేకి ధోనీ గుడ్‌బై:

ట్రేడింగ్‌ విండో 15న ముగియనుండగా.. సరిగ్గా ఒక రోజు ముందు (నవంబర్‌ 14న) ఓ నెటిజన్‌ ధోనీకి సీఎస్‌కే గుడ్‌బై చెప్తోందని సన్నిహిత వర్గాల సమాచారం ద్వారా తెలిసింది అని ట్వీట్‌ చేశాడు. మహీని సీఎస్‌కే అట్టిపెట్టుకోకుండా రేపు వదిలేస్తోందని ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో చెన్నై అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

గుడ్‌బై చెప్పే సమయం వచ్చింది:

నెటిజన్‌ ట్వీట్‌పై చెన్నై ఫ్రాంచైజీ మండిపడింది. అదే సమయంలో ఘాటుగా స్పందించింది. 'సన్నిహిత వర్గాలకు గుడ్‌బై చెప్పే సమయం వచ్చింది' అని ట్వీట్ చేసింది. దీంతో ఆ నెటిజన్‌కు చెన్నై చురకలు అంటించింది. తాజా ట్వీట్ ద్వారా చెన్నై అభిమానుల అనుమానాలు పటాపంచలు అయ్యాయి. గతంలోనే చెన్నై యజమాని శ్రీనివాసన్ వచ్చే ఏడాది ధోనీ ఆడుతాడు అని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

విడుదల ఆటగాళ్ల జాబితా:

విడుదల ఆటగాళ్ల జాబితా:

సామ్ బిల్లింగ్స్, డేవిడ్ విల్లీ, ధ్రువ్ షోరే, చైతన్య బిష్ణోయ్, మోహిత్ శర్మలను చెన్నై విడుదల చేసిన విషయం తెలిసిందే. ట్రేడింగ్‌ విండో చివరి గడువుకు ముందు మురళి విజయ్, కేదార్ జాదవ్, అంబటి రాయుడు, శార్ధూల్ ఠాకూర్, కరణ్ శర్మలను కూడా చెన్నై వదులుకుంటుందని రూమర్లు వచ్చాయి. కానీ.. అవన్ని గాలి వార్తలే అని తేలిపోయింది.

తాత్కాలిక విరామం:

తాత్కాలిక విరామం:

ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ మ్యాచ్ తర్వాత ధోనీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. సైన్యంలో సేవ చేస్తానని రెండు నెలలు స్వయంగా విరామం తీసుకున్నాడు. విండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ పర్యటనలకు దూరంగా ఉన్నాడు. దీంతో మహి వీడ్కోలు, భవితవ్యంపై ఎన్నో వదంతులు వచ్చాయి. అయితే వారం క్రితమే ఝార్ఖండ్‌ క్రికెట్‌ మైదానంలో మహీ సాధన చేసాడు. దీంతో అభిమానులు ఆనందించారు. త్వరలోనే అతడి ఆటను చూస్తామని సంతోషం వ్యక్తం చేశారు.

Retained Players List:

Retained Players List:

MS Dhoni (c), Suresh Raina, Faf du Plessis, M Vijay, Ravindra Jadeja, Mitchell Santner, Lungi Ngidi, Kedar Jadhav, Ambati Rayudu, Narayan Jagadeesan, Harbhajan Singh, KM Asif, Shardul Thakur, Shane Watson, Imran Tahir, Ruturaj Gaikwad, Deepak Chahar, Monu Kumar, Karn Sharma.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, November 19, 2019, 18:09 [IST]
Other articles published on Nov 19, 2019
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more