For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే చెత్త రికార్డు!

CSK IPL 2025: ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచే అవకాశం ఉంది. మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 8 వికెట్లకు 187 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా ఆడింది. 17 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను గెలుచుకుంది. రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. చెన్నై 13 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరొక మ్యాచ్ మిగిలి ఉంది. ఇదిలా ఉండగా.. నికర రన్ రేట్‌లో సీఎస్కే రాజస్థాన్ రాయల్స్ కంటే వెనుకబడి ఉంది. అందుకే చివరి మ్యాచ్‌లో సీఎస్కే చివరి మ్యాచ్‌లో గెలిచినా పాయింట్ల పట్టికలో పదో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్‌ను అధిగమించాలంటే.. చెన్నై జట్టుకు భారీ విజయం అవసరం. సీఎస్కే తన చివరి మ్యాచ్‌లో మే 25న నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ జట్టుతో తలపడనుంది.

CSK Registers Worst IPL Record in 2025 Last on Points Table for First Time

పాయింట్ల పట్టికలో మెరుగుపడాలంటే ఏం చేయాలి?
గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేస్తే కనీసం 107 పరుగుల తేడాతో గెలవాలి. దీని కోసం గుజరాత్ జట్టును 93 పరుగులకే ఔట్ చేయాల్సి ఉంటుంది. గుజరాత్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేస్తే పరిస్థితి మరింత కష్టంగా ఉంటుంది. గుజరాత్ 180 పరుగులు చేస్తే రాజస్థాన్ కంటే మెరుగైన నికర రన్ రేట్ సాధించాలంటే సీఎస్కే 8వ ఓవర్ వరకే లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది.

చెన్నై మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. చెన్నై ఈ సీజన్ లో 10వ ఓటమిని చవిచూసి 2022లో తన పేరిట ఉన్న చెత్త రికార్డును సమం చేసింది. 2022లోనూ సీఎస్కే 10 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. అలాగే 2012, 2020లో 8 మ్యాచ్‌ల్లో ఓడింది.

ఇది నాలుగో సారి..
ఐపీఎల్ అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఇప్పటివరకు సీఎస్కే జట్టు 5 టైటిళ్లను గెలుచుకుంది. ముంబై ఇండియన్స్ కూడా 5 ట్రోఫీలను గెలుచుకుంది. అత్యధిక మ్యాచ్‌లను గెలిచిన జట్టుగా ముంబై తర్వాత చెన్నై రెండో స్థానంలో ఉంది. అత్యధిక ప్లేఆఫ్స్, ఫైనల్స్‌కు చేరుకున్న రికార్డును కూడా సీఎస్కే కలిగి ఉంది. చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుకోకపోవడం ఇది నాలుగోసారి మాత్రమే.

Story first published: Wednesday, May 21, 2025, 7:49 [IST]
Other articles published on May 21, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+