తమ సొంత మైదానంలో మరోసారి ఆధిపత్యం చెలాయించేందుకు చెన్నై సూపర్ కింగ్స్ రెడీ అవుతోంది. ఈ సీజన్‌లో చెపాక్‌లో ఆడిన ఐదు మ్యాచుల్లో మూడింట చెన్నై ఓడిన సంగతి తెలిసిందే. అయితే చివరగా ఇక్కడ ఆడిన మ్యాచ్‌లో ముంబైపై పూర్తి ఆధిపత్యం చెలాయించిందీ జట్టు. ఈ క్రమంలో ఢిల్లీపై కూడా అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది.
అయితే ఈ మ్యాచ్‌లో కూడా ఇంగ్లిష్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఆడటం అనుమానంగానే ఉంది. అతను కొన్ని రోజులుగా ఫిట్‌గానే కనిపిస్తున్నా కూడా ఆడే అవకాశం మాత్రం రావడం లేదు. ప్రస్తుతం చెన్నై జట్టులో ఉన్న నలుగురు విదేశీ ప్లేయర్లు కూడా జట్టుకు చాలా కీలకంగా మారారు.

ఓపెనర్‌గా డెవాన్ కాన్వే అదరగొడుతున్నాడు. అలాగే బౌలింగ్‌లో మతీష పతిరాణాను తొలగించడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఒక మిగిలింది మొయీన్ అలీ, మహీష్ తీక్షణ. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు వీళ్లిద్దరూ అదరగొట్టే ప్రదర్శనలు చేయలేదు. అయితే తనదైన రోజున ఎలాంటి ప్రత్యర్థిపై అయినా ఒంటి చేత్తో గెలిపించే సత్తా మొయీన్ అలీకి ఉంది.
ఇక తీక్షణ విషయంలో చెన్నై యాజమాన్యం కఠినంగా ప్రవర్తించినా కూడా.. జట్టులోకి దూసుకొచ్చేందుకు మిచెల్ శాంట్నర్ రెడీగా ఉన్నాడు. చెపాక్ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంది కాబట్టి.. అతన్నే ఆడించడం కరెక్ట్ కూడా. ఈ క్రమంలో స్టోక్స్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం దొరకడం అసాధ్యంగా కనిపిస్తోంది. అయితే అతను పూర్తి ఫిట్‌గా ఉండటంతోపాటు ప్రాక్టీస్ సెషన్స్‌లో చక్కగా బ్యాటింగ్ చేస్తుండటం అభిమానులకు శుభవార్తే.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (అంచనా): డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, మొయీన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), దీపక్ చాహర్, మతీష పతిరాణా, తుషార్ దేశ్‌పాండే, మహీష్ తీక్షణ