Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పంజాబ్ కింగ్స్‌కు సామ్ కరణ్ సీరియస్ వార్నింగ్! (వీడియో వైరల్)

IPL 2025 Sam Curran: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సామ్‌ కరన్‌ తమ మాజీ జట్టు పంజాబ్ కింగ్స్ టీమ్ మేనేజ్‌మెంట్ పై మండిపడ్డాడు! తాజాగా చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో మైదానంలోనే పంజాబ్ జట్టుపై అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

అసలు ఏం జరిగిందంటే?
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. సామ్‌ కరన్‌ (88; 47 బంతుల్లో 9×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో కే 190 పరుగులు చేసి ఆలౌటైంది. నెం.3వ స్థానంలో వచ్చిన సామ్ కరన్ బ్రిలియంట్ నాక్ ఆడాడు. 47 బంతుల్లో 88 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజన్ లో అతడికి ఇది తొలి అర్ధ శతకం కావడం విశేషం. కానీ ఆ తర్వత లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఊదేయడంతో చెన్నై ఓడిపోయింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి కూడా తప్పుకుంది.

అయితే 18వ ఓవర్ లో ఔట్ అయిన సామ్ కరన్.. మార్కో జాన్సన్ బౌలింగ్ లో జోస్ ఇంగ్లిష్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. తన ఔట్ కన్ఫామ్ అయ్యాక క్రీజును వీడాడు. అయితే క్రీజు నుంచి సీఎస్కే డగౌట్ వైపు నడుస్తూ వెళ్లే క్రమంలో సామ్ కరన్ అసహనం వ్యక్తం చేశాడు. పంజాబ్ కింగ్స్ మేనేజ్ మెంట్, ప్లేయర్స్ వైపు సీరియస్ గా చూస్తూ ఏదో అనబోయాడు. సైగలు కూడా చేశాడు. కానీ అలానే నడుచుకుంటూ సీఎస్కే డగౌట్ లోకి వెళ్లిపోయాడు.

CSK Player Sam curran behaviour goes wrong with Punjab Kings in csk vs pbks match ipl 2025

అయితే సామ్ కరన్ ప్రవర్తించిన తీరు కెమెరాలో రికార్డు అయింది. వాస్తవానికి సామ్ కరన్... ఐపీఎల్ 2024 సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు ఆడాడు. అప్పుడు రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం వల్ల పలు మ్యాచులకు దూరమైతే.. సామ్ కరన్ సారథ్యం కూడా వహించాడు. కానీ ఆ సమయంలో సామ్ బాగా ఆడినప్పటికీ.. 2025 సీజన్ ముందు వేలంలో పంజాబ్ మేనేజ్ మెంట్ అతడిని రిటైన్ చేసుకోలేదు. కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుని, మిగతా వాళ్లను రిలీజ్ చేసింది. కోచ్ రికీ పాంటింగ్ ఆధ్వర్యంలో కొత్త టీమ్ ను బిల్డ్ చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఆ స్ట్రాటజీ సక్సెస్ అయింది. 10 మ్యాచుల్లో ఆరింటిలో గెలిచింది.

అయితే తనను పంజాబ్ రిటైన్ చేసుకోకుండా వదిలేసినందుకే.. సామ్ కరన్ తాజాగా మైదానంలో అలా బిహేవ్ చేశాడని కొందరు అంటుంటే.. మరికొంతమంది ఔట్ అవ్వడం అసహనం వ్యక్తం చేశాడని చెబుతున్నారు. మొత్తంగా పంజాబ్ జట్టుతో సామ్ కరన్ కు విభేదాలు ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో సామ్ కరణ్ కే తెలియాలి. ఏదిఏమైనా ఈ మ్యాచులో సీఎస్కే ఓడినప్పటికీ.. సామ్ కరణ్ మాత్రం అద్భుతంగా రాణించాడనే చెప్పాలి.

Story first published: Thursday, May 1, 2025, 11:01 [IST]
Other articles published on May 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+