ఐపీఎల్ 2025 కోసం సీఎస్కే స్టార్ బ్యాటర్ ధోనీ ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు తెలిసింది. అలానే ఈ సీజన్ కోసం కొత్త బ్యాట్ తో బరిలోకి దిగబోతున్నట్లు సమచారం అందింది. ఇంకా ఈ సీజన్ కోసం సీఎస్కే నిర్వహించనున్న ప్రీ ఐపీఎల్ క్యాంప్ కు కూడా హాజరుకానున్నట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
బ్యాట్ బరువును కాస్త తగ్గించుకుని..
ఈ సీజన్ లో ధోనీ అన్ క్యాప్డ్ ప్లేయర్ గా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. అయితే సాధారణంగా ధోనీ వినియోగించే బ్యాట్ బరువు 1250-1300 గ్రాములు ఉంటుంది. గతంలోనూ ధోనీ అత్యంత బరువు ఉన్న బ్యాట్ ను వాడేవాడు. కానీ ఈ సారి బ్యాట్ బరువును కనీసం 10- 20 గ్రాములు తగ్గించుకుంటాడని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాట్ 1230 గ్రాముల బరువు ఉండేలా తయారు చేయించుకుంటున్నాడట.

"రీసెంట్ గానే నాలుగు బ్యాట్లను మేరఠ్ కు చెందిన సాన్స్ పరీల్స్ గ్రీన్ ల్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ధోనీకి డెలివరీ చేసింది. ప్రతీ బ్యాట్ బరువు దాదాపు 1230 గ్రాములు ఉంటుంది. గతంలో మహీ వాడిన బ్యాట్ మోడల్ లానే వీటిని తయారు చేశారు." అని ఓ ప్రతినిధి చెప్పాడు.
అప్పటి వరకు నో యూజ్..
"సీఎస్కే ట్రైనింగ్ షెడ్యూల్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. చిదంబరం స్టేడియం మార్చి 9 వరకు ట్రైనింగ్ కోసం ఉపయోగించకూడదు. ఎందుకంటే ఈ స్టేడియాన్ని ఆప్టిమల్ కండిషన్స్ గా మెయిన్ టెయిన్ చేసేందుకు బీసీసీఐ స్ట్రిక్ట్ ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చింది. " అని పేర్కొన్నాడు.
Deepak Chahar's Instagram story. 💛 pic.twitter.com/Q0JLNCz38V
— Tanuj Singh (@ImTanujSingh) February 25, 2025
రాంచీలో బౌలింగ్ మెషీన్ తో ప్రాక్టీస్..
ధోనీ ప్రస్తుతం రాంచీలో ప్రాక్టీస్ చేస్తున్నాడట. తన స్క్రిల్స్ ను మరింత పదునుగా చేసేందుకు బౌలింగ్ మెషీన్ తో సాధన చేస్తున్నాడట. ఈ విషయాన్ని ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ కు చెందిన ఓ అధికారి తెలిపారు. గతంలో ఇక్కడే ధోనీ టెన్నిస్ బంతితోనూ మ్యాచ్ ఆడాడని సదరు అధికారి వెల్లడించారు.