Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSKకు బిగ్ షాక్.. టోర్నీ నుంచి స్టార్ పేసర్ ఔట్!

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఏప్రిల్ 14న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సీజన్లో చెన్నైకి ఆరంభంలోనే వికెట్లు తీసిపెడుతున్న ఖలీల్ దూరం కావడం ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

కోల్‌కతా ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేస్తున్న సమయంలో ఖలీల్ అహ్మద్ గాయపడ్డాడు. ఓవర్ చివరి బంతి వేయడానికి రన్-అప్ తీసుకుంటున్న సమయంలో ఖలీల్ కుడి తొడ భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో మధ్యలోనే ఆగిపోయాడు. నొప్పితో విలవిలలాడిన ఖలీల్ అహ్మద్.. మెడికల్ టీమ్ సహాయంతో మైదానాన్ని వీడాడు. ఆ ఓవర్లో మిగిలిన ఒక్క బంతిని గుర్జప్నీత్ సింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌లో గాయపడకముందు ఖలీల్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రమాదకరమైన సునీల్ నరైన్ వికెట్ పడగొట్టాడు.

CSK Pacer Khaleel Ahmed Ruled Out of IPL 2026 Due to Injury Big Blow for Ruturaj Gaikwad

వైద్య పరీక్షల అనంతరం ఖలీల్‌కు 'గ్రేడ్ 2 టియర్' అయినట్లు నిర్ధారణ అయింది. ఖలీల్ అహ్మద్ కుడి కాలు కండరం తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ గాయం నుండి కోలుకోవడానికి కనీసం 10 నుండి 12 వారాల సమయం పడుతుందని.. ఈ నేపథ్యంలో ఖలీల్ అహ్మద్ ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని వైద్య బృందం స్పష్టం చేసింది. చాలా కాలం విశ్రాంతి అవసరమని ఖలీల్‌కు సూచించారు.

ఈ సీజన్‌లో చెన్నై ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ ఖలీల్ అహ్మద్ తుది జట్టులో ఉన్నాడు. పవర్ ప్లేలో పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్న ఖలీల్ స్థానాన్ని భర్తీ చేయడం ఇప్పుడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు సవాలుగా మారింది. టోర్నమెంట్ కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో ఖలీల్ వంటి కీలక ఆటగాడు దూరం కావడం సీఎస్కే అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. త్వరలోనే ఖలీల్ అహ్మద్ స్థానంలో రిప్లేస్‌మెంట్ ప్లేయర్‌ను జట్టు ప్రకటించే అవకాశం ఉంది.

Story first published: Thursday, April 16, 2026, 13:24 [IST]
Other articles published on Apr 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+