విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ లో పంజాబ్, మహారాష్ట్ర మధ్య తలపడ్డాయి. అయితే వడోదరాలోని కొతంబి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సీఎస్కే పేసర్, మూడు హ్యాట్రిక్ సెంచరీలతో జోరు మీదున్న పంజాబ్ బ్యాటర్ ను బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
టీమ్‌ఇండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్ (137; 105 బంతుల్లో 20 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతక్కొట్టాడు. అంతకుముందు గత రెండు మ్యాచ్‌ల్లో.. ముంబయిపై (150*), సౌరాష్ట్రపై (125) సెంచరీలు బాదాడు. అలా వరుసగా మూడో సెంచరీలతో చెలరేగి ఆడాడు.

అయితే ప్రస్తుతం జరుగుతోన్న విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ ను బోల్తా కొట్టించాడు చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ ముకేశ్ చౌదరి. తన సూపర్ బౌలింగ్ తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో జోరు మీదున్నప్రభ్‌సిమ్రన్ ను ఔట్ చేశాడు. ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో అతడు పెవిలియన్ చేరాడు. ముకేశ్ పర్ఫెక్ట్ ఔట్ సింగ్ ను సంధించగా, ప్రభ్‌సిమ్రన్ సింగ్ డ్రైవ్ ఆడబోయి ఔట్ అయ్యాడు. బంతి స్వింగ్ అయి ఆఫ్ స్టంప్ మీదుగా వెళ్లింది. దీంతో ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ కేవలం 17 బంతుల్లో 14 పరుగులకే వెనుదిరిగాడు. ముకేశ్ తీసిన వికెట్ తో మహారాష్ట్ర ప్రభ్‌సిమ్రన్ సింగ్ దాడి నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోనే బీసీసీఐ డొమాస్టిక్ క్రికెట్ తన ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. ముకేశ్ వేసిన బంతి అదిరింది అంటూ రాసుక్చొచ్చింది.
ముకేశ్ చౌదరి తన ఆరు ఓవర్లలో మూడు వికెట్లు తీశాడు. తన గత ఐదు మ్యాచుల్లో కలిపి ఏడు వికెట్లు దక్కించుకున్నాడు. అంతకుముందు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నమెంట్ లో మొత్తం 15 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. కాగా, ఐపీఎల్ మెగా వేలంలో సీఎస్కే ముకేశ్ చౌదరిని రూ.3 కోట్లకు దక్కించుకుంది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ ను పంజాబ్ రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది.
What a ball from Mukesh Choudhary 🔥#VijayHazareTrophy | @IDFCFIRSTBank
— BCCI Domestic (@BCCIdomestic) January 11, 2025
Scorecard ▶️ https://t.co/eTrCnJbd5H pic.twitter.com/Fy07G6totM