ధోనికి ఢోకా లేదిక: ఫ్యాన్స్‌కు అద్దిరిపోయే గుడ్‌న్యూస్ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్

అబుధాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో మహేంద్ర సింగ్ ధోనీ కేప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టోర్నమెంట్లపై ఎప్పట్లాగే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం 18 పాయింట్లతో టేబుల్‌లో రెండో స్థానంలో ఉందా టీమ్. తాను ఆడిన చివరి రెండు మ్యాచ్‌లల్లో ఓడిపోయినప్పటికీ.. ప్లేఆఫ్స్ అవకాశాలు ఏ మాత్రం దెబ్బతినలేదు. ఇప్పటికే ప్లేఆఫ్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. లీగ్ దశలో తన చిట్టచివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఎదుర్కొనబోతోంది ధోనీ సేన. ఈ మ్యాచ్ గురువారం సాయంత్రం 7:30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనుంది.

ధోని ఉంటాడా? ఉండడా?
వచ్చే ఏడాది నిర్వహించే ఐపీఎల్ 2022 సీజన్ 15వ ఎడిషన్ నాటికి ఎంఎస్ ధోని అందుబాటులో ఉంటాడా? లేడా? అనే విషయంపై ఇదివరకే డిబేట్స్ సాగాయి. వయసు మల్లడం వల్ల ఇక ధోని ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతాడని, అతనికి ఇదే చివరి ఐపీఎల్ కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ సీజన్ ముగిసిన తరువాత ఐపీఎల్ నుంచి కూడా రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడనే అనుమానాలు తలెత్తాయి.
వాటన్నింటినీ పటాపంచలు చేశాడు తలైవా. 2022 సీజన్‌లో ఆడబోతున్నాననే హింట్ ఇచ్చాడు. నేరుగా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు గానీ.. తన ఫేర్‌వెల్ మ్యాచ్ చెన్నై చెపాక్ స్టేడియంలో ఉంటుందని హామీ ఇచ్చాడు.

ధోనీకి ఢోకా లేదిక
తోటి ప్లేయర్లు దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహిర్, శార్దుల్ ఠాకూర్‌లతో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ అఫీషియల్ యూట్యూబ్ పేజ్‌లో అభిమానులతో ఇంటారాక్ట్ అయ్యాడు ధోనీ. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. చెపాక్ స్టేడియంలో ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడతాననే భరోసా ఇచ్చాడు. వచ్చే ఏడాది జరిగే ఈ మెగా టోర్నమెంట్‌లో ఆడే అవకాశం ఉండటం వల్లే ధోనీ.. తన అభిమానికి ఈ ప్రామిస్ చేశాడు. తన ఫేర్‌వెల్ మ్యాచ్ చెపాక్‌లో ఉంటుందని స్పష్టం చేశాడు.

ఫ్రాంఛైజీ ఓనర్ సైతం..
ధోని ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఓనర్ ఇండియా సిమెంట్స్ స్పందించింది. అతను ఈ హామీ ఇచ్చిన మరుసటి రోజే.. ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తాము ధోనిని వదులుకోవడానికి సిద్ధంగా లేమని తేల్చి చెప్పింది. ఐపీఎల్ 2022 సీజన్, 15వ ఎడిషన్‌కు కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోనీ ఉంటాడని, కేప్టెన్‌గా కొనసాగుతాడని స్పష్టం చేసింది. అక్కడితో ఆగలేదు ఫ్రాంఛైజీ ఓనర్. ఇంకా కొన్ని సంవత్సరాల పాటు అతను జట్టుతో ప్రయాణం సాగిస్తాడని తేల్చి చెప్పింది.

ధోనిని కొనసాగిస్తున్నాం..
ధోనిని జట్టులో కొనసాగించబోతున్నామని ఇండియా సిమెంట్స్ స్పష్టం చేసింది. వచ్చే సంవత్సరం కూడా అతను జట్టులో ఉంటాడని, ఇంకా కొన్నేళ్ల పాటు జట్టులో కొనసాగుతాడని తెలిపింది. ధోనిని తొలగించడంపై గానీ, ఐపీఎల్ టోర్నమెంట్లలో అతని రిటైర్‌మెంట్ గురించి గానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం గానీ, దాని మీద చర్చించడం గానీ టీమ్ మేనేజ్‌మెంట్‌లో చోటు చేసుకోలేదనే క్లారిటీ ఇచ్చింది.
వచ్చే సంవత్సరం తన ఫేర్‌వెల్ మ్యాచ్ ఉంటుందంటూ ధోని ఇచ్చిన హామీని తాము ఓ అభిమానికి ఇచ్చిన హామీ గానే చూస్తున్నామని తేల్చి చెప్పింది. వచ్చే సంవత్సరం ధోని తన చివరి ఐపీఎల్ టోర్నమెంట్‌ను ఆడతాడని భావించడానికి ఏ మాత్రం అవకాశమే లేదని కుండబద్దలు కొట్టింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications