
అత్యంత విజయంతమైన టీం
ఐపీఎల్‌లో అత్యంత విజయంతమైన టీంగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని నాయకత్వంలో ఆరి తేరిన ఆ జట్టు ఇప్పటివరకు ముగిసిన 14 సీజన్లలో 12 సీజన్లలో పాల్గొన్న చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు స్థాయిలో ఏకంగా 11 సార్లు క్వాలిఫై రౌండ్ చేరింది. దీంతో ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క టీంగా నిలిచింది. 2020లో మాత్రమే చెన్నై క్వాలిఫైయర్ రౌండ్ చేరలేకపోయింది. 4 సార్లు ట్రోఫి కూడా గెలిచింది. అంతేకాకుండా లీగ్‌లో అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా కూడా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో ఆ జట్టు అనేక అవార్డులను కూడా గెలుచుకుంది.
అందని ద్రాక్షగానే రెండు అవార్డులు
ఐపీఎల్‌లో అనేక రికార్డులతోపాటు ఎన్నో ఘనతలను ఖాతాలో వేసుకున్న చెన్నైసూపర్ కింగ్స్ జట్టుకు లీగ్ చరిత్రలో రెండు అవార్డులు అందని ద్రాక్షలాగానే మారిపోయాయి. అందులో ఒకటి మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డు కాగా, మరొకటి మోస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు. ఈ రెండు అవార్డులను ఐపీఎల్ చరిత్రలో చెన్నైసూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఒక్కసారి కూడా గెలుచుకోలేకపోయారు. సీఎస్కేలోని ఆటగాళ్లంతా ప్రతి సీజన్‌లో అద్బుతంగా ఆడుతున్నారు. కానీ ఈ రెండు అవార్డులను మాత్రమే ఆ జట్టు ఆటగాళ్లు ఒక్కసారి కూడా గెలుచుకోలేకపోయారు.

ఆ అవార్డును గెలుచుకోనిది చెన్నై ఒకటే
అవార్డుల్లో ఒకటైనా మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డును చెన్నైతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఇప్పటివరకు ఒక్క సారి కూడా గెలుచుకోలేకపోయాయి. ఇక మోస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డునైతే ఇప్పటివరకు సీఎస్కే మాత్రమే ఒక్కసారి కూడా గెలుచులేకపోయింది. మిగతా జట్లన్నీ ఈ అవార్డును ఎప్పుడో ఒక్కసారి గెలిచాయి.

ఆరెంజ్, పర్పుల్ క్యాప్ గెలవని టీంలు
ఇక ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఒక్క సారి కూడా ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకోలేకపోయాయి. ఒక సీజన్‌లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లకు ఆరెంజ్ క్యాప్ ఇస్తారనే సంగతి తెలిసిందే. అలాగే కోల్‌కతా నైట్‌రైడర్స్ పర్పుల్ క్యాప్‌ను ఒక్కసారి కూడా గెలుచుకోలేకపోయింది. ఈ క్యాప్‌ను ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లకు ఇస్తారు.

ట్రోఫీ గెలవని జట్లు
ఇక ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలవలేకపోయాయి. అలాగే ఫెయిర్ ప్లే అవార్డును ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇప్పటివరకు ఒక్క సారి కూడా గెలుచుకోలేకపోయాయి.


Click it and Unblock the Notifications












