Maheesh Theekshana : 117కేజీల బరువు వల్ల టీంలోకి తీసుకోలేదు.. వాటర్‌బాయ్‌లా చూసేవారు

చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ - 2022లో రాణించలేకపోతుంది. ఆడిన 11 మ్యాచ్‌లలో కేవలం 4 మ్యాచ్ ల్లో గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను దాదాపుగా కోల్పోయింది. ఇక ఈ జట్టు ప్లేయర్లలో కొందరు మాత్రం అద్భుతంగా రాణించి వెలుగులోకి వచ్చారు. అందులో శ్రీలంకన్ మిస్టరీ స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఒకడు. మొదటి కొన్ని గేమ్‌లలో బెంచ్‌కే పరిమితమైన ఈ శ్రీలంకర్ స్పిన్నర్.. తర్వాత ప్లేయింగ్ XIలో అవకాశ రావడంతో తానెంటో నిరూపించుకున్నాడు. చెన్నై జట్టుకు మిడిల్ ఓవర్లలో కీలకమైన వికెట్లు తీస్తూ మంచి ఎకానమీ మెయింటన్ చేస్తూ రాణించాడు. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన తీక్షణ 12వికెట్లు పడగొట్టాడు.
అంత ఈజీగా ఏం దక్కలేదు
తీక్షణకు చెన్నై లాంటి జట్టులో ఆడే అవకాశం అంత ఈజీగా ఏం దక్కలేదు. కొన్ని సంవత్సరాలుగా చాలా కష్టపడ్డాడు. 2022 మెగా వేలంలో రూ.70లక్షలకు ఎంపికైన ఈ 21ఏళ్ల శ్రీలంకన్ ప్లేయర్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ఫిట్ నెస్ పరంగా ఎనలేని కష్టం చేశాడు. తన ఫిట్‌నెస్ కష్టాలను ఎలా అధిగమించాడో సీఎస్కే ట్విట్టర్ హ్యాండిల్‌లో అతను వివరించాడు. ఫైనల్‌గా సీఎస్కే తరఫున ఆడటంతో తన డ్రీమ్ నెరవేరిందని పేర్కొన్నాడు.

యోయో టెస్ట్‌లో పాస్ కాలేకపోయేవాణ్ని
అండర్ 19 జట్టులో ఆడుతున్న టైంలో నా బరువు 117కిలోలుగా ఉండేది. కాబట్టి యోయో టెస్ట్‌లో పాసవ్వడం కష్టమయ్యేది. అందుకే నా బరువును తగ్గించుకోవడానికి విపరీతంగా కష్టపడాల్సి వచ్చింది. 2020లో విజయవంతంగా నేను అనుకున్న రీతిలో నా బరువు తగ్గించుకోగలిగాను. నా ఫిట్‌నెస్‌ను మంచి స్థాయికి తీసుకువచ్చాను. ఇక అప్పటి నుంచి నేను నా శరీరంపై మరింత కష్టపడి పనిచేయడం ప్రారంభించాను.' అని తీక్షణ సీఎస్కే అప్‌లోడ్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.

నన్ను సీఎస్కే వేలంలో కొంటుందని అనుకోలేదు
'2020లో నేను శ్రీలంకన్ దిగ్గజం అజంతా మెండిస్‌తో నా విషయాన్ని చర్చించాను. 2022లో మా కెప్టెన్ ఎంఎస్ ధోనీతో కూడా మాట్లాడాను. గతేడాది నేను నెట్ బౌలర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున పనిచేశాను. అయితే ఈసారి మెగావేలంలో నా కోసం వారు వేలం వేస్తారని అస్సలు అనుకోలేదు. కానీ నన్ను నమ్మి కొనుగోలు చేయడం ఎనలేని సంతోషాన్నిచ్చింది.' అని తీక్షణ పేర్కొన్నాడు. అండర్ 19జట్టుకు ఆడే రోజులలో తన బరువు సమస్యల కారణంగా తరచుగా బెంచ్‌కే తను పరిమితం కావాల్సి వచ్చేదని, అయినప్పటికీ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని తీక్షణ స్పష్టం చేశాడు.

వాటర్ బాయ్‌గా మారిపోయాను
'2017-18లో నేను శ్రీలంకన్ అండర్-19 జట్టులో ఉన్నాను. కానీ నేను కొన్నిసార్లు ఫిట్‌నెస్ పరీక్షలలో విఫలమైనందున నాకు ఆడే అవకాశాలు సరిగా రాలేదు. 2019లో నేను 10గేమ్‌లకు వాటర్ బాయ్‌గా మారాల్సి వచ్చింది. ఇక నేను ఫిట్‌నెస్‌లో విఫలమైతే నేను మళ్ళీ వాటర్ బాటిల్స్ అందించే ప్లేయర్‌గానే కొనసాగాల్సి ఉంటుందని భయపడ్డాను. ఇక నా ఫిట్ నెస్‌పై ఫోకస్ పెంచాను. నాపై నేను నమ్మకం ఉంచాను. ఎప్పుడూ కూడా డై ఆటిట్యూడ్ ను నా దరిచేరనివ్వను. అందుకే 2022లో ఐపీఎల్లో ఆడగలుగుతున్నాను' అని తీక్షణ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications