For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌‌కు మిస్టర్ ఐపీఎల్ దూరం: జట్టుకు భారమా? గాయమా?

CSK in PlayOffs: Suresh Raina might miss the playoffs matches due to injury

అబుధాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్‌లో లీగ్ దశ మ్యాచులు ముగియనున్నాయి. ఈ సాయంత్రం రెండు జట్లు తమ ప్రత్యర్థులతో తలపడనున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ కేపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఇందులో తొలి రెండు జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో అడుగు పెట్టాయి. సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ టోర్నమెంట్ నుంచి తప్పుకోనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు కూడా నామమాత్రంగా మిగిలే అవకాశం ఉంది.

ఎల్లుండి నుంచి

ఎల్లుండి నుంచి

ఇక ప్లేఆఫ్స్ మొదలు కానున్నాయి. ప్లేఆఫ్స్‌లో తొలి మ్యాచ్ ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ఆరంభం కానుంది. టేబుల్ టాపర్‌గా నిలిచిన ఢిల్లీ కేపిటల్స్‌ తన ప్రత్యర్థిని ఎదుర్కొంటుంది. ఆ ప్రత్యర్థి ఎవరనేది ఈ సాయంత్రం నాటి రెండు చిట్టచివరి లీగ్ మ్యాచులు ముగిసిన తరువాత తేలిపోతుంది. టేబుల్ టాపర్‌గా నిలిచిన కారణంగా ఢిల్లీ కేపిటల్స్.. ఒక ప్లే ఆఫ్ ఓడినా.. మరో అవకాశం ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. మూడు, నాలుగు స్థానాల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కత నైట్ రైడర్స్ ఉన్నాయి.

సురేష్ రైనా అవుట్..

సురేష్ రైనా అవుట్..

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు.. ప్లేఆఫ్స్‌ దశలో ఆల్‌రౌండర్‌ సురేష్ రైనా అందుబాటులో ఉండకపోవచ్చు. గాయం వల్ల అతను ప్లేఆఫ్స్ అన్ని మ్యాచుల్లోనూ ఆడకపోవచ్చని తెలుస్తోంది. సురేష్ రైనా గాయానికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ కూడా తన వద్ద లేదని చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పడాన్ని బట్టి చూస్తోంటే.. కొన్ని అనుమాలు తలెత్తుతున్నాయి. అతను నిజంగానే గాయపడ్డాడా? లేక జట్టు నుంచి తప్పించారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.

ఫామ్‌లో లేని మిస్టర్ ఐపీఎల్..

ఫామ్‌లో లేని మిస్టర్ ఐపీఎల్..

సురేష్ రైనా పెద్దగా ఫామ్‌లో లేడు. ఇప్పటిదాకా 12 మ్యాచ్‌లను ఆడిన అతను 160 పరుగులు మాత్రమే చేశాడు. ఓ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడంతే. ఈ సీజన్‌లో అతని వ్యక్తిగత అత్యుత్తమ స్కోర్ 54 పరుగులు. అతని బ్యాటింగ్ యావరేజ్ 17.77 పరుగులు మాత్రమే. ఐపీఎల్ టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు షిఫ్ట్ అయిన తరువాత అతను అయిదు మ్యాచులను ఆడాడు. 37 పరుగులు చేశాడు. ఈ సారి కూడా అతను బౌలింగ్‌కు దూరంగానే ఉన్నాడు.

గాయమా? తొలగింపా?

గాయమా? తొలగింపా?

అదే సమయంలో మోకాలికి గాయం కావడం వల్ల సురేష్ రైనాను మేనేజ్‌మెంట్ తప్పించింది. అతని స్థానంలో రాబిన్ ఉతప్పను తుదిజట్టులోకి తీసుకుంది. ప్లేఆఫ్స్‌కు సురేష్ రైనా దూరమౌతాడంటూ వస్తోన్న వార్తల పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది. గాయం వల్ల కాదని, ఫామ్‌ను కోల్పోవడం వల్లే అతన్ని పక్కన పెట్టారని చెబుతున్నారు. సురేష్ రైనా ఇదివరకట్లా మెరుపులు మెరిపించట్లేదని, అతను జట్టుకు భారంగా మారాడని అంటున్నారు.

నో అప్‌డేట్స్..

నో అప్‌డేట్స్..

ప్లేఆఫ్స్‌లో సురేష్ రైనా అందుబాటులో ఉన్నా, లేకపోయినా ఒకేటనని, అతని ఆటతీరు మీద డిపెండ్ కాలేమనే అభిప్రాయాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద వ్యక్తమౌతున్నాయి. హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సైతం.. సురేష్ రైనా పట్ల పెద్దగా ఆసక్తిగా ఉండట్లేదని అంటున్నారు. అతని గాయం మీద తనకు ఎలాంటి తాజా సమాచారం లేదని తేల్చేయడాన్ని దీనికి ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నారు. సురేష్ రైనా ఫామ్‌లో ఉండి ఉంటే కోచ్ స్థాయి వ్యక్తి నుంచి ఇలాంటి ప్రకటన వచ్చేది కాదని భావిస్తున్నారు.

Story first published: Friday, October 8, 2021, 12:48 [IST]
Other articles published on Oct 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+