
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2018వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అట్టిపెట్టుకునే ఆ మూడో ఆటగాడు కూడా క్రికెట్ అభిమానులకు తెలిసిపోయింది. ఇప్పటికే ఐపీఎల్‌లోని అన్ని ఫ్రాంఛైజీలు ఎవర్ని తిరిగి తమ జట్టులోకి తీసుకోవాలి.. ఏయే ఆటగాడిని రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా ఎంచుకోవాలన్న దానిపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాయి.
తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంఛైజీ ఆ జట్టు కెప్టెన్ ధోనితో పాటు సురేశ్ రైనాను తమ వద్దే అట్టిపెట్టుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విషయంలో మాత్రం కాస్త సందిగ్ధత నెలకొంది. అయితే చెన్నై జట్టు ఐపీఎల్ ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్‌కు ముందు తమ జట్టులో ఉండే ముగ్గురు ఆటగాళ్లకు సంబంధించి ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
అందులో చెన్నై ఫ్రాంచైజీ అట్టిపెట్టుకునే ముగ్గురు ఎవరో ట్విటర్ ద్వారా అభిమానులకు ముందుగానే చెప్పేసింది. అంకెల రూపంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున గత సీజన్లలో బరిలోకి దిగిన ఆటగాళ్ల జెర్సీ నెంబర్లను సూచిస్తూ ట్వీట్ చేసింది. అంతేకాదు ఈ నెంబర్‌కు మరో ప్రత్యేక కూడా ఉంది. మద్రాసు నగరం ఏర్పడి ఇప్పటికి 378 ఏళ్లు అయ్యింది.
* మొదటి నంబర్-3: మూడో నంబర్ జెర్సీ సురేశ్ రైనా జెర్సీని సూచిస్తుంది.
* రెండో నంబర్-7: ఏడో నంబర్ జెర్సీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిది అన్న సంగతి తెలిసిందే.
* మూడో నంబర్-8: భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.