For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శివం దుబే 19వ ఓవర్ వేయడానికి కారణం ఇదే: కోచ్ స్టీఫెన్ క్లారిటీ: ఘోర తప్పిదం

CSK coach Stephen Fleming given the reason to hand the 19th over to Shivam Dube against LSG

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్పై సూపర్ కింగ్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. తొలి రెండు మ్యాచ్‌లల్లో ఈ టీమ్ పరాజయం పాలవడం ఇదే తొలిసారి. ఇప్పటిదాకా ఆడిన తొలి రెండింట్లో ఓడిన సందర్భాలు లేవు. ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ , తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాభవాన్ని చవి చూసింది. భారీ స్కోర్ సాధించినప్పటికీ- దాన్ని విజయంగా మలచుకోలేకపోయిందీ టైటిల్ హాట్ ఫేవరెట్ టీమ్.

 బ్యాటింగ్‌లో క్లిక్.. బౌలింగ్‌లో ఫ్లాప్

బ్యాటింగ్‌లో క్లిక్.. బౌలింగ్‌లో ఫ్లాప్

రెండో మ్యాచ్‌లో బ్యాటర్లు రాణించినప్పటికీ.. వారికి బౌలర్ల సహకారం లేకుండా పోయింది. బౌలర్ల అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఏ ఒక్క బౌలర్ కూడా ప్రత్యర్థిపై ఒత్తిడిని తీసుకుని రాలేకపోయాడు. ఉన్నంతలో డ్వేన్ ప్రిటోరియస్ ఫర్వాలేదనిపించుకున్నాడు. నాలుగు ఓవర్లల్లో 31 పరుగులు ఇచ్చి రెండు వికెట్ల పడగొట్టాడు. సీనియర్ బౌలర్ డ్వేన్ బ్రావో సైతం పరిస్థితిని చక్కదిద్దలేకపోయాడు. మొయిన్ అలీ, శివమ్ దుబే, రవీంద్ర జడేజా ఓవర్లల్లో బ్యాటర్లు పరుగులు పిండుకున్నారు.

ముంచిన దూబే

ముంచిన దూబే

చెన్నై సూపర్ కింగ్స్‌ గెలుపుపై కొద్దో గొప్పో ఆశలు ఉన్నప్పటికీ.. దాన్ని మొత్తం తుడిచి పెట్టేలా చేసింది ఇన్నింగ్ 19వ ఓవర్. శివం దూబే వేసిన ఆ ఓవర్‌లో ఏకంగా 25 పరుగులు రాబట్టుకున్నారు బ్యాటర్లు. రెండు ఎక్స్‌ట్రాలతో మొత్తంగా ఎనిమిది బంతులు విసిరాడా ఓవర్‌లో. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు, రెండు వైడ్స్ ఇచ్చుకున్నాడు. అంతకుముందు- మొయిన్ అలీ వేసిన ఓవర్‌లోనూ ఇదే పరిస్థితి. అతనూ ఒకే ఒక్క ఓవర్ వేసి 14 ఇచ్చాడు.

తప్పిన అంచనాలు..

తప్పిన అంచనాలు..

కీలకమైన 19వ ఓవర్‌ను వేసే అవకాశం శివం దుబేకు ఇవ్వడం కూడా రవీంద్ర జడేజా చేసిన ఘోర తప్పిదాల్లో ఒకటి. 12 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన దశలో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌కు బదులుగా దుబేకు బంతిని ఇవ్వడం శాపంగా మారింది. ఈ ఓవర్ ముగిసే సమయానికి సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. చివరి ఓవర్‌ను ముఖేష్ చౌదరి ఇచ్చి మరో తప్పు చేశాడు జడేజా. ఆ ఓవర్‌ను ఉత్కంఠభరితంగా మార్చే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

 కోచ్ ఏం చెప్పాడు..

కోచ్ ఏం చెప్పాడు..

19వ ఓవర్‌ను శివం దుబేకు ఇవ్వడం పట్ల హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వివరణ ఇచ్చాడు. స్పిన్నర్లు విఫలం కావడం వల్ల మరో ప్రత్యామ్నాయం తమ వద్ద లేకుండా పోయిందని చెప్పాడు. నయాగరా ఫాల్స్‌లా తడి వాతావరణం గ్రౌండ్‌లో కనిపించిందని, స్పిన్నర్లు ఫెయిల్ కావడానికి అదే కారణమని పేర్కొన్నాడు. తడి వల్ల స్పిన్నర్లు బంతిపై పట్టును సాధించలేకపోయారని, పేసర్ మీద ఆధారపడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించాడు.

గేమ్ మధ్యలో నిర్ణయం..

గేమ్ మధ్యలో నిర్ణయం..

19వ ఓవర్‌ బంతిని శివం దుబే చేతికి ఇవ్వాలని తాము ముందుగా అనుకోలేదని స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పాడు. స్పిన్నర్లు విఫలం అయిన అనంతరం ఈ డెసిషన్ తీసుకున్నామని పేర్కొన్నాడు. డెత్ ఓవర్‌లో మరో ప్రత్యామ్నాయ బౌలర్ లేడని వ్యాఖ్యానించాడు. రవీంద్ర జడేజా, మొయిన్ అలీ ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న విషయాన్ని పరోక్షంగా గుర్తు చేశాడు. పేసర్‌తో ఆ ఓవర్ వేయించాలనే విషయాన్ని అప్పుడే తీసుకున్నామని చెప్పాడు. ఆ ఓవర్‌లో లక్నో జెయింట్స్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు.

Story first published: Friday, April 1, 2022, 13:39 [IST]
Other articles published on Apr 1, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+