For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పొరపాటు చేశా.. తన తప్పును అంగీకరించిన సీఎస్కే కోచ్!

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం ఇప్పుడు కష్టంగా మారింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆ జట్టు మొత్తం 9 మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో సీఎస్కే ఓడిపోయింది. ఐపీఎల్‌లో తొలిసారిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఎస్కేను దాని సొంత మైదానంలో ఓడించగలిగింది. ఈ ఓటమితో సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇప్పుడు వేలంలో తన తప్పును అంగీకరించాడు.

సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. తాము ఆడిన విధానం పూర్తిగా అనుకూలంగా ఉందని చెప్పడం కష్టమన్నారు. మా విధానాన్ని పూర్తి పునఃపరిశీలించుకుంటున్నామని చెప్పారు. దానిని మెరుచుపరచుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తామన్నారు. మా రికార్డు పట్ల గర్వంగా ఉన్నామని.. ఈ లీగ్‌లో చాలా కాలంగా ఆధిపత్యం చెలాయించామని చెప్పారు. ఈ చెడు దశ నుంచి త్వరగా బయటపడతామన్నారు.

CSK Coach Stephen Fleming Admits Auction Mistakes After SRH Defeat

వేలంలో జరిగిన తప్పుల గురించి మాట్లాడిన స్టీఫెన్ ఫ్లెమింగ్
ప్రారంభంలో సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తన జట్టును సమర్థించాడు. కానీ తర్వాత వేలంలో యాజమాన్యం కొన్ని తప్పులు చేసిందని అంగీకరించాడు. వేలంలో చాలా జట్లు సీఎస్కే కంటే మంచి ఆటగాళ్లను ఎంచుకున్నాయని చెప్పాడు. మేము దానిని సరిగా చేయలేకపోయామని కోచ్ స్పష్టం చేశాడు. దీనిని పరిగణించాలని పేర్కొన్నాడు. మాకు వేలం అనుకున్నంత బాగా జరగలేదు లేదా మేము కోరుకున్న విధంగా జరగలేదని సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.

స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. వేలం చాలా త్వరగా జరిగే ప్రక్రియ అని.. ఒక విధంగా చెప్పాలంటే ఇది 25 ఇళ్లు కొన్నట్లేనని చెప్పుకొచ్చాడు. నిజాయితీగా చెప్పాలంటే సీఎస్కేకు ఇప్పటికీ మంచి జట్టు ఉందని తాను భావిస్తున్నానన్నారు. సీఎస్కే తిరిగి ఫామ్‌లోకి రావడానికి ఇంకా ఎంతో దూరంలో లేమన్నారు.

Story first published: Saturday, April 26, 2025, 14:09 [IST]
Other articles published on Apr 26, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+