For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MS Dhoni : ధోనీ, జడేజా మధ్య గొడవలు.. అసలు విషయం చెప్పిన చెన్నై సీఈవో!

గతేడాది నుంచి ఐపీఎల్‌లో జరుగుతున్న ప్రధాన చర్చల్లో ధోనీ, జడేజా గొడవ కూడా ఒకటి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా 2022 సీజన్ ఆరంభానికి ముందే జడేజాను ప్రకటించారు. కానీ అతని కెప్టెన్సీలో జట్టు చాలా పేలవ ప్రదర్శన చేసింది. దీంతో మళ్లీ కెప్టెన్సీ బాధ్యతను ధోనీ తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఈ ఇద్దరి మధ్య గొడవలు మొదలైనట్లు వార్తలు వచ్చాయి.

ఇదే సమయంలో సీఎస్‌కేకు సంబంధించిన ట్వీట్లు, ఇన్‌స్టా పోస్టులను జడ్డూ డిలీట్ చేసేయడం ఈ వదంతులకు మరింత ఆజ్యం పోసింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ధోనీ కన్నా ముందు జడేజా బ్యాటింగ్‌కు వస్తే.. ఫ్యాన్స్ అంతా 'ధోనీ.. ధోనీ..' అంటూ నినాదాలు చేశారు. ఈ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేసిన జడేజా.. ఒక ట్వీట్ చేశాడు. దీంతో ధోనీ, జడేజా గొడవ మరింత పెద్దదైంది. ఈ విషయంపై సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ స్పందించారు.

'జడేజా విషయానికొస్తే.. అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక బ్యాటింగ్‌లో రుతురాజ్, కాన్వే, మొయీన్, రహానే ఉన్నారు. దీంతో జడేజా బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి 5-10 బంతులే ఉండేవి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి క్లిక్ అయితే.. ఒక్కోసారి అనుకున్నట్లు ఆడలేం. తనకు కూడా ఆ తర్వాత ధోనీ రావాలని తెలుసు. కానీ ఒక్కోసారి జడ్డూకే 2-3 బంతులు ఉంటాయి. ఏం చేస్తాడు?' అని విశ్వనాథ్ ప్రశ్నించాడు.

'ఇలా జరిగినప్పుడు జడేజా బ్యాటింగ్‌కు వెళ్తే.. ప్రేక్షకులు అందరూ ధోనీ రావాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. దీని వల్ల జడ్డూ ఏమైనా బాధ పడి ఉండొచ్చు. అలాంటి ఒత్తిడి ఏ ఆటగాడికైనా ఉండొచ్చు. కానీ దీని గురించి జడ్డూ ట్వీట్ చేసినా.. ఎప్పుడూ ఎవరితోనూ ఏమీ అనలేదు' అని విశ్వనాథ్ వెల్లడించాడు. ధోనీ రావడం కోసం తను త్వరగా అవుట్ అవ్వాలని కొందరు ఫ్యాన్స్ కోరుకుంటున్నారని జడ్డూ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

CSK CEO talks about Rift between MS Dhoni and Ravindra Jadeja

ఇక ఒక మ్యాచ్ అనంతరం జడేజాతో విశ్వనాథ్ చాలా సీరియస్‌గా మాట్లాడుతున్న వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. దీంతో జడేజాతో ధోనీ గొడవ పెద్దదైందని, దీంత సీఎస్కే యాజమాన్యం రంగంలోకి దిగిందని వార్తలు వచ్చాయి. 'ఇదంతా ఆటలో సహజమే. ఆ వీడియో చూసిన వాళ్లు.. నేనేదో జడేజాను తిట్టిపారేస్తున్నా అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదు. ఆ మ్యాచ్ గురించి, అతను ఆడిన విధానం గురించే మాట్లాడుకున్నాం. ఇంకేం లేదు' అని విశ్వనాథ్ తెలిపాడు.

అలాగే డ్రెస్సింగ్ రూంలో జరిగే విషయాలు బయటకు రాకూడదని చెప్పాడు. 'ఒక టీం వాతావరణంలో.. డ్రెస్సింగ్ రూంలో జరిగే విషయాలు బయటకు రాకూడదు. మాకు సంబంధించి జట్టులో ఎలాంటి సమస్యలు లేవు. జడ్డూ ఎప్పుడూ ధోనీకి చాలా గౌరవం ఇస్తాడు. ఫైనల్ తర్వాత కూడా తన ఇన్నింగ్స్‌ను ధోనీకే అంకితం ఇచ్చినట్లు జడ్డూ చెప్పాడు. ధోనీ అంటే జడ్డూకు అంత రెస్పెక్ట్' అని విశ్వనాథ్ పేర్కొన్నాడు.

Story first published: Thursday, June 22, 2023, 9:16 [IST]
Other articles published on Jun 22, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+