Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: 'ధోనీ బ్యాటింగ్‌లో ఏమాత్రం పస తగ్గలేదు.. స్టాండ్స్‌పై నుంచి భారీ సిక్సర్‌లు కొడుతున్నాడు'

CSK CEO Kashi Viswanathan MS Dhoni training well, hit sixes in all directions during practice session

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌) 2020‌ కోసం రంగం సిద్ధమైంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19న మొదలయ్యే లీగ్‌ కోసం ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి కావచ్చాయి. ఇప్పటికే కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్, రాజస్తాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ యూఏఈకి చేరుకున్నాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు ఆదివారం బయల్దేరి వెళ్లే అవకాశముంది.

ఏమాత్రం పస తగ్గలేదు:

ఏమాత్రం పస తగ్గలేదు:

చెన్నైలో గత కొన్ని రోజులుగా ప్రాక్టీస్‌ చేస్తున్న ధోనీసేన.. ఐపీఎల్‌ 2020 టైటిల్‌ వేట కోసం పక్కా ప్రణాళికతో సమాయత్తమైంది. ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, మురళీ విజయ్, దీపక్ చహర్, పీయూష్ చావ్లా, కేదార్ జాదవ్, శార్దూల్ ఠాకూర్ వంటి లాంటి స్టార్‌ క్రికెటర్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ముఖ్యంగా చెన్నై సారథి ధోనీ నెట్‌లో కఠినంగా శ్రమించాడు. స్పిన్, పేస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో మహీ స్టాండ్స్‌ మీదిగా భారీ సిక్సర్లను బాదుతూ మంచి హుశారుగా కనిపించాడని చెన్నై టీం మెనేజర్ కాశీ విశ్వనాథన్ స్టార్ స్పోర్ట్స్‌కు వెల్లడించారు.

కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.

కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.

చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన పలు విషయాలపై కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీ మంచి స్టామినాతో ఆడుతున్నాడు. మైదానంలోని అన్ని వైపులా షాట్స్ ఆడుతూ ప్రాక్టీస్ సెషన్‌లో హుశారుగా గడిపారు. అతని బ్యాటింగ్‌లో ఏమాత్రం పస తగ్గలేదు. స్టాండ్స్‌పై నుంచి భారీ భారీ సిక్సర్‌లు కొడుతూ ఫుల్ ఫీట్‌గా కనిపించాడు. ధోనీ గత ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్లో చివరి మ్యాచ్ ఆడాడు. అయినా అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మహీ గురించి మాకు ఎలాంటి ఆందోళన లేదు' అని తెలిపారు.

ఎలాంటి సమాచారం ఇవ్వలేదు:

ఎలాంటి సమాచారం ఇవ్వలేదు:

'ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ సంబంధించిన విషయం అతని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారానే తెలుసుకుంన్నాం. ఒక్కసారిగా అందరం ఆశ్చర్యపోయాం. మహీ చెన్నై జట్టుకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. అతని నిర్ణయం జట్టును కూడా ఆశ్చర్యపరించింది. రిటైర్మెంట్ వ్యక్తిగత నిర్ణయం. మహీ రెండో ఇన్నింగ్స్ బాగుండాలి' సీఈఓ కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు. 2020, 2021 సీజన్లలో కచ్చితంగా మహీ పాల్గొంటాడని, 2022లో సైతం ఆడతాడని తాము అంచనా వేస్తున్నామని ఇదివరకే విశ్వనాథన్ ధీమా వ్యక్తం చేశారు.

ముంబైతో తొలి మ్యాచ్‌:

ముంబైతో తొలి మ్యాచ్‌:

ఈ నెల 15 నుంచి చెన్నై ఆటగాళ్లకి ఆ టీమ్ ఫ్రాంఛైజీ క్యాంప్ ఏర్పాటు చేసింది. శుక్రవారం ఆ క్యాంప్ నుంచి నేరుగా ఆటగాళ్లు యూఏఈకి బయల్దేరి వెళ్లారు. కెప్టెన్ ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, సురేశ్ రైనా, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ తదితరులు యూఏఈకి విమానం ఎక్కుతూ కనిపించారు. ఐపీఎల్ 2019 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియ్స్ చేతిలో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్.. సెప్టెంబరు 19న ముంబైతోనే తొలి మ్యాచ్‌లో ఢీకొట్టబోతోంది.

Story first published: Saturday, August 22, 2020, 9:56 [IST]
Other articles published on Aug 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+