Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఇద్దరి వల్లే ఓడిపోయాం: రుతురాజ్ గైక్వాడ్

ఐపీఎల్(IPL 2026) 2026లో ఐదు సార్లు ఛాంపియన్ అయిన సీఎస్కేకు వరుసగా రెండో షాక్ తగిలింది. సొంత గడ్డపై అభిమానుల హోరు మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ వరుసగా రెండో గెలుపును నమోదు చేయగా.. సీఎస్కే తన ఖాతాను తెరవడంలో మరోసారి విఫలమైంది. ఈ ఓటమి అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన మనోగతాన్ని పంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో తాము నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యం గెలవడానికి సరిపోతుందని భావించినట్లు గైక్వాడ్ వెల్లడించాడు. పిచ్ పేసర్లకు అనుకూలించినప్పటికీ, స్లోయర్ బంతులు గ్రిప్ అవుతున్నాయని, భారీ బౌండరీలను పరిగణనలోకి తీసుకుంటే అది మంచి స్కోరు అని రుతురాజ్ గైక్వాడ్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌లో తమ ప్రదర్శన పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశాడు .

స్పిన్నర్లకు కలిసి రాలేదు: రుతురాజ్
ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో తాము అనుకున్న ప్రణాళికలు సరిగ్గా అమలు కాలేదని రుతురాజ్ అంగీకరించాడు. ముగ్గురు సీమర్లతో పాటు ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లు కలిసి బౌలింగ్ చేయడం వల్ల జట్టుకు ప్రయోజనం ఉంటుందని ఇంపాక్ట్ ప్లేయర్ వ్యూహంతో బరిలోకి దిగామని.. కానీ ఆ ఇద్దరు స్పిన్నర్లకు అది కలిసిరాని రోజని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. మధ్య ఓవర్లలో కీలక సమయంలో ఒత్తిడి పెంచలేకపోవడం, వికెట్లు తీయలేకపోవడం తమను దెబ్బతీసిందని, దీనివల్లే పంజాబ్ బ్యాటర్లకు బ్యాటింగ్‌పై పట్టు లభించిందని వివరించాడు.

CSK Captain Ruturaj Gaikwad on Loss to Punjab Kings Says Those Two Spinners Cost Us

ఆయుష్ మాత్రే అద్భుతం
మ్యాచ్ ఫలితం నిరాశపరిచినప్పటికీ, జట్టులో కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. ముఖ్యంగా యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అలాగే శివమ్ దూబే కూడా జట్టుకు కీలక పరుగులు అందించాడని ప్రశంసించాడు. బ్యాటింగ్ విభాగంలో తమకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉందని.. అయితే బౌలింగ్ విషయంలో మాత్రం మెరుగుపడాల్సిన అంశాలు చాలా ఉన్నాయని ఆయన నిజాయితీగా ఒప్పుకున్నాడు.

'నేను తప్పుడు సమయంలో అవుట్ అయ్యా'.
తన వ్యక్తిగత ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. పిచ్ బంతిని గ్రిప్ చేస్తుండటంతో క్రీజులో కాసేపు నిలదొక్కుకుని, ఆ తర్వాత వేగంగా పరుగులు రాబట్టాలని భావించినట్లు రుతురాజ్ తెలిపాడు. కానీ దురదృష్టవశాత్తూ తప్పుడు సమయంలో అవుట్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు. వచ్చే మ్యాచ్‌ల్లో బౌలింగ్ లోపాలను సరిదిద్దుకుని బలంగా పుంజుకుంటామని రుతురాజ్ గైక్వాడ్ ధీమా వ్యక్తం చేశాడు.

Story first published: Saturday, April 4, 2026, 0:02 [IST]
Other articles published on Apr 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+