పరుగు పందెంలో పాల్గొన్న ధోనీ.. విజేత ఎవరో తెలుసా?

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ ఏది చేసినా సంచలమే. మైదానంలో కూల్ కెప్టెన్‌గా ఉండే మహీ.. ఆవల మాత్రం తనదైన చిలిపి పనులతో అలరిస్తుంటాడు. ఈ అల్లరి తన కూతురు జీవాతోనైనా, సహచర ఆటళ్లతోనైనా లేదా అభిమానులతో అయినా ఒకే విధంగా ఉంటుంది. అయితే ఈ పనులన్నీ ధోనీ మ్యాచ్ ముగిసిన అనంతరం చేయడం విశేషం. డ్రెస్సింగ్ రూములో తోటి ఆటగాళ్లతో సరదా ముచ్చట్లు, తనకోసం మైదానంలోకి దూసుకొచ్చిన అభిమానులను పరుగెత్తించడం ధోనీకే చెల్లింది.

పిల్లలతో ధోనీ సందడి:
శనివారం చెన్నై వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం మైదానంలోకి వచ్చిన ధోనీ.. పిల్లలతో ఆడుతూ సందడి చేశాడు. చెన్నై జట్టు స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్, ఓపెనర్ షేన్‌వాట్సన్‌ల కుమారులు మైదానంలోకి వచ్చారు. వీరిద్దరికి సరదాగా పరుగు పందెం పెట్టారు. ఆ పోటీలో తాహీర్ కుమారుడు కొద్దిపాటి తేడాతో ఓడిపోయాడు.
గెలిచిన తాహీర్ కుమారుడు:
ఇది గమనించిన మహీ మళ్లీ వాళ్లిద్దరినీ పరుగెత్తమని.. వాళ్లతో పాటు పరుగు పందెంలో పాల్గొన్నాడు. పందెంలో వెనకబడ్డ తాహీర్ కుమారుడిని ఎత్తుకొని మహీ పరుగెత్తాడు. తాహీర్ కుమారుడు పరుగులో విజయం సాధించాడు. దీంతో విజయం సాధించానంటూ తాహీర్ కుమారుడు ఎగిరి గంతేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు.

ధోనీ మెరుపులు:
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరలో చెన్నై కెప్టెన్ ధోనీ 37 (23 బంతుల్లో; 4x4 1x6) పరుగులు చేసాడు. అనంతరం చెన్నై బౌలర్లు విజృంభించడంతో.. పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి ఓడిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications