న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్ప‌నున్న చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌!!

CSK All-Rounder Moeen Ali To Retire From Test Cricket, Announcement Coming Soon

దుబాయ్: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ మొయిన్ అలీ.. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చాడు. రాబోయే యాషెస్​ 2021 సిరీస్‌ సమయంలో మొయిన్​ అలీ రిటైర్మెంట్​ ప్రకటించే అవకాశాలున్నాయని బ్రిటిష్ మీడియా పేర్కొనగా.. అంతకుముందే అలీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. వైట్-బాల్ ఫార్మాట్లలో తన కెరీర్‌ను సుదీర్ఘ కాలం కొనసాగించేందుకే.. అలీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడట. తాను రిటైర్ అవుతున్న విష‌యాన్ని మొయిన్ అలీ గతంలోనే ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌, హెడ్ కోచ్ క్రిస్ సిల్వ‌ర్‌వుడ్‌కు తెలిపాడట. వారితో పాటు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఒప్పుకోవడంతో.. తాజాగా మొయిన్ అలీ అధికారకంగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు.

RCB vs MI: 'విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను బుల్లెట్ ట్రైన్ లాగా ఆరంబించి.. ఒక్కసారిగా గూడ్స్ ట్రైన్ అయిపోయాడు'RCB vs MI: 'విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను బుల్లెట్ ట్రైన్ లాగా ఆరంబించి.. ఒక్కసారిగా గూడ్స్ ట్రైన్ అయిపోయాడు'

ఇంగ్లండ్ త‌ర‌ఫున 64 టెస్టులు ఆడిన మొయిన్ అలీ 2914 ప‌రుగులు చేశాడు. 195 వికెట్లు కూడా తీశాడు. టెస్టుల్లో 5 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు బాదాడు. అత్యధిక స్కోర్ 155 నాటౌట్. 53 పరుగులు ఇచ్చి 6 వికెట్లు కూడా పడగొట్టాడు. 2019 యాషెస్ సిరీస్ త‌ర్వాత మొయిన్ అలీ పెద్ద‌గా టెస్ట్ క్రికెట్‌లో క‌నిపించ‌లేదు. ఇటీవల టీమిండియాతో టెస్ట్ సిరీస్‌లో మ‌ళ్లీ చోటు ద‌క్కించుకున్న అలీ.. మూడు టెస్టుల్లో ఆడాడు. అయితే పెద్దగా ప్రభావం మాత్రం చూపలేకపోయాడు. ఐపీఎల్ 2021, కౌంటీ క్రికెట్ ఫామ్ కొనసాగించలేకపోయాడు. ఇక ఇంగ్లండ్ తరఫున 112 వన్డేల్లో 1877 రన్స్ 87 వికెట్లు.. 38 టీ20ల్లో 437, 21 వికెట్లు పడగొట్టాడు.

ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ మొయిన్​ అలీ ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021​లో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టు తరఫున మొయిన్​ అలీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 2021లో అలీ దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో బరిలోకి దిగి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఐపీఎల్ 2021 తొలి దశలో ఆకట్టుకున్న అలీ.. రెండో దశలో కూడా రాణిస్తున్నాడు. అబుదాబి వేదికగా ఆదివారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో అలీ 28 బంతుల్లో 32 రన్స్ చేశాడు. దాంతో చెన్నై విజయం వైపు దూసుకెళ్లింది. 19వ ఓవర్లో రవీంద్ర జడేజా వరుస బౌండరీలతో చెలరేగడంతో చెన్నై త్రిల్లింగ్ విక్టరీ అందుకుంది.

Story first published: Monday, September 27, 2021, 13:03 [IST]
Other articles published on Sep 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X