Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DJ Bravo: శ్రీ‌వ‌ల్లి పాట‌కు సీఎస్కే స్టార్‌ ఆల్‌రౌండ‌ర్ కిర్రాక్ స్టెప్పులు.. వీడియో వైర‌ల్

CSK All Rounder DJ Bravo Immiates Allu Arjun Sri Valli Song From Pushapa Movie Watch The Video Here

ప్ర‌స్తుతం అంత‌టా అల్లు అర్జున్ న‌టించిన పుష్ప మానియా న‌డుస్తోంది. ఎక్క‌డా చూసిన అభిమానులంతా అల్లు అర్జున్ మేన‌రిజంతో ఆక‌ట్టుకుంటున్నారు. సాధార‌ణ మ‌నుషుల నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కు ఈ విష‌యంలో ఎవ‌రూ త‌గ్గ‌డం లేదు. అంత‌టితో ఆగ‌కుండా తాము ఇమిటేట్ చేసిన వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా పుష్ప మానియా ఎప్పుడో దేశం దాటేసింది. భార‌త‌దేశానికి చెందిన క్రీడాకారులే కాకుండా విదేశాల‌కు చెందిన ఆట‌గాళ్లు కూడా పుష్ప సాంగ్స్‌ను, డైలాగుల‌ను ఇమిటేట్ చేస్తూ అద‌ర‌గొడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో చెన్నైసూప‌ర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ డీజే బ్రావో కూడా చేరిపోయాడు.

బ్రావో స్టెప్పులు అదుర్స్‌

పుష్ప చిత్రంలోని శ్రీ‌వ‌ల్లి పాట‌కు వెస్టిండీస్, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల ఆల్‌రౌండ‌ర్ డేజే బ్రావో అదిరిపోయే స్టెప్పుల‌తో అదుర్స్ అనిపించాడు. అచ్చం అల్లు అర్జున్ మేన‌రిజంతో ఆక‌ట్టుకున్నాడు. అత‌ని లాగే క‌ళ్ల జోడు ధ‌రించి, చెప్పుల‌ను ఉప‌యోగించి స్టెప్పులు వేసి ఆక‌ట్టుకున్నాడు. ఆ స‌మ‌యంలో బ్రావో తెల్ల‌ని క్యాప్ కూడా ధ‌రించ‌డాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఓ స్విమ్మింగ్‌ఫూల్ ప్ర‌దేశంలో తీసిన వీడియోను పుష్ప టీం త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేసి మురిసిపోయింది. 18 సెక‌న్ల‌తో కూడిన ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. దీంతో అభిమానులు లైక్‌లు, కామెంట్లు, షేర్లు చేస్తూ సోష‌ల్ మీడియాను ఊపేస్తున్నారు.

రిటెన్షన్ జాబితాలో బ్రావోకు నో చాన్స్

రిటెన్షన్ జాబితాలో బ్రావోకు నో చాన్స్

కాగా ఐపీఎల్‌లో చాలా కాలంగా చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న స్టార్ ఆల్‌రౌండ‌ర్ బ్రావోకు ఈ సారి ఆ జ‌ట్టు రిటెన్ష‌న్ జాబితాలో చోటు ద‌క్క‌లేదు. దీంతో ఈ సారి బ్రావో వేలంలో పాల్గొన‌నున్నాడు. కాగా చెన్నై సూప‌ర్ కింగ్స్ రిటెన్ష‌న్ జాబితాలో ర‌వీంద్ర జ‌డేజా, ఎంఎస్ ధోని, మొయిన్ అలీ, రుతు రాజ్ గైక్వాడ్‌కు చోటు ల‌భించింది.

బీపీఎల్‌లోనూ పుష్ప మానియా

ఇక బంగ్లాదేశ్ ప్రిమీయ‌ర్ లీగ్‌లోనూ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప చిత్రం మానియా క‌నిపించింది. ఈ లీగ్‌లో బంగ్లాదేశ్ ఆట‌గాడు నజ్ముల్ ఇస్లాం ప్ర‌జెంటేష‌న్ సెర్మ‌నీ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ పుష్ప చిత్రం చూశాన‌ని, బాగుంద‌ని ప్ర‌శంస‌లు కురిపించాడు. అలాగే అల్లు అర్జున్ మాదిరి మేన‌రిజంతో త‌గ్గెదేలే అని డైలాగ్ చెప్పి అద‌ర‌గొట్టాడు. దీనికి సంబంధించిన 30 సెక‌న్ల‌ వీడియో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఫ్యాన్ ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేయ‌గా నెట్టింట వైర‌ల్‌గా మారింది.

పుష్ప సూప‌ర్ హిట్‌

పుష్ప సూప‌ర్ హిట్‌

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పుష్ప చిత్రం డిసెంబ‌ర్‌లో విడుద‌లై సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఒక్క తెలుగులోనే కాకుండా ఇత‌ర భాష‌ల్లో, బాలీవుడ్‌లో, విదేశాల్లోనూ మంచి విజ‌యం సాధించింది. సినిమాలోని అల్లు అర్జున్ మేన‌రిజానికి అభిమానులు ఫిదా అయిపోయారు. డైలాగ్‌లు, పాట‌లు అభిమానుల‌ను బాగా ఆకట్టుకున్నాయి. కాగా రెండు పార్టులుగా రానున్న పుష్ప సెకండ్ పార్టు షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.

Story first published: Tuesday, January 25, 2022, 18:55 [IST]
Other articles published on Jan 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+