మెస్సీ పేరు వింటేనే రొనాల్డోకు మండింది.. ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్!
ఫిఫా వరల్డ్ కప్ 2026లో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్నాడు. ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ 5-0 తేడాతో ఘనవిజయం సాధించగా.. రొనాల్డో రెండు అద్భుతమైన గోల్స్ చేశాడు. ఈ గోల్స్‌తో ఆరు వేర్వేరు ప్రపంచకప్‌లలో గోల్స్ చేసిన ప్రపంచంలోనే ఏకైక ఆటగాడిగా క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. అంతే కాకుండా వరల్డ్ కప్‌లలో పోర్చుగల్ తరఫున అత్యధిక గోల్స్ (10) చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సాధించాడు. అయితే ఈ చారిత్రాత్మక విజయం తర్వాత మీడియా సమావేశంలో చోటుచేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మెస్సీ పేరు వినగానే అసహనం!
మ్యాచ్ ముగిసిన అనంతరం 'మిక్స్‌డ్ జోన్' ఇంటర్వ్యూలో క్రిస్టియానో రొనాల్డో మీడియాతో మాట్లాడుతుండగా.. ఒక స్పానిష్ జర్నలిస్ట్ అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ, కిలియన్ ఎంబాపేల గురించి ప్రశ్నించడం ప్రారంభించారు. అయితే ఆ ప్రశ్న పూర్తిగా ముగియక ముందే రొనాల్డో తీవ్ర అసహనానికి గురయ్యారు. జర్నలిస్ట్ వైపు నుంచి ముఖం తిప్పేసుకుని, పక్కనే ఉన్న మరో రిపోర్టర్ వైపు సైగ చేస్తూ తదుపరి ప్రశ్న అడగాలని కోరాడు. దీంతో సదరు రిపోర్టర్ తన ప్రశ్నను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.

పొలిటికల్ సమాధానం.. ఆపై ఆగ్రహంతో వాకౌట్
నాకౌట్ రౌండ్‌లో పోర్చుగల్, అర్జెంటీనా జట్లు తలపడే అవకాశం ఉందనే అంశంపై జర్నలిస్టులు ప్రశ్నించగా.. రొనాల్డో కొంతమేర స్పందించాడు. "దీనికి ఏం సమాధానం చెప్పాలో నాకు తెలియడం లేదు. ఈ ప్రశ్నకు పెద్దగా అర్థం లేదు, కానీ ఒకవేళ ఆ మ్యాచ్ జరిగితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది" అని రొనాల్డో అన్నాడు. అయితే ఆ తర్వాత కూడా జర్నలిస్టులు మెస్సీ చేసిన గోల్స్ గురించి పదే పదే ప్రశ్నించడంతో రొనాల్డోకు కోపం నశాలానికి అంటింది. "నాకు ఇతరుల గురించి ఎలాంటి పట్టింపు లేదు, అక్కడ ఎంబాపే కూడా గోల్స్ చేశాడు" అని కోపంగా సమాధానమిస్తూ ఇంటర్వ్యూ మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
రెండు దశాబ్దాల సుదీర్ఘ పోరు
క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీల మధ్య మైదానంలో ఉన్న పంతం, పోటీ ఈనాటిది కాదు. గత రెండు దశాబ్దాలుగా వీరిద్దరిలో అత్యుత్తమ ఆటగాడు ఎవరనే అంశంపై ఫుట్‌బాల్ ప్రపంచంలో నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా 2009 నుంచి 2018 మధ్య కాలంలో రొనాల్డో రియల్ మాడ్రిడ్‌కు, మెస్సీ బార్సిలోనా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ స్పానిష్ లీగ్ 'లా లిగా'లో ఆడినప్పుడు వీరి మధ్య పోటీ పీక్స్‌కు చేరింది. ఇప్పటికీ వీరిద్దరి అభిమానులు సామాజిక మాధ్యమాలలో ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటూనే ఉంటారు. రొనాల్డో తాజా ప్రవర్తనతో మైదానం వెలుపల కూడా వీరి మధ్య ఉన్న రైవల్రీ మరోసారి స్పష్టమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications