Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అసభ్యకర సైగలు: రొనాల్డోకు రూ.15.64లక్షల జరిమానా

Cristiano Ronaldo Fined by UEFA for Atletico Celebration

హైదరాబాద్: ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్లలో క్రిస్టియానో రొనాల్డో ఒకడు. తాజాగా ఛాంపియన్ లీగ్ క్వార్టర్ ఫైనల్లో అసభ్యకర సైగలు చేసిన రొనాల్డోకు భారీ నష్టపరిహారం విధించింది ఆ లీగ్ యాజమాన్యం. ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా నాకౌట్ దశ రెండో లీగ్ మ్యాచ్‌లో భాగంగా జువెంటస్ జట్టు అట్లెటికో మాడ్రిడ్‌‌తో తలపడింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో జ్యూవెంటస్ జట్టు 3 గోల్స్ చేసి అట్లెటికొ మాడ్రిడ్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో జ్యూవెంటస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రొనాల్డొ ఒక్కడే మూడు గోల్స్ చేసి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. మ్యాచ్‌ 27వ నిమిషంలో జువెంటస్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో తొలి గోల్ సాధించాడు.

దీంతో తొలి అర్థభాగం చివరికల్లా 1-0 తేడాతో జువెంటస్ జట్టు ఆధిక్యంలో నిలిచింది. తదనంతరం జరిగిన రెండో అర్థభాగంలో రొనాల్డో తన రెండో గోల్ సాధించాడు. ఆపై పెనాల్టీతో మరో గోల్ సాధించి అదరగొట్టాడు. దీంతో 3-0 తేడాతో జువెంటస్ విజయం సాధించింది. ఈ విజయంతో ఛాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్లోకి చేరుకుంది.

అనంతరం విజయోత్సవ సంబరాల్లో భాగంగా రొనాల్డో ప్రత్యర్థి జట్టు పట్ల అసభ్యకర సైగలు చేశాడు. రొనాల్డో చేష్టలు తమ మనో భావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అట్లెటికో కోచ్ డిగో సిమోన్ ఫిర్యాదు చేశాడు. దీంతో రొనాల్డొపై యూఈఎఫ్ఏ చాంపియన్ లీగ్ యాజమాన్యం 20వేల యూరోలు(అంటే రూ. 15.65లక్షలు) జరిమానా విధించింది.

Story first published: Friday, March 22, 2019, 16:57 [IST]
Other articles published on Mar 22, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+