టీమ్ 5: బిపాసాబసుతో క్రికెటర్ శ్రీశాంత్ డ్యాన్స్
ముంబై: ఇటీవలే బీజేపీలోకి చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే, మరోవైపు సినిమా రంగంపై కన్నేశాడు కేరళ స్పీడస్టర్, మాజీ క్రికెటర్ శ్రీకాంత్. శ్రీశాంత్ ప్రస్తుతం మళయాళ చిత్రం టీమ్ 5లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్‌లో డ్యాన్స్ చేసేందుకు బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసుని తీసుకోనున్నట్లు సినీ వర్గాల సమాచారం.

ఈ పాటలో బిపాసాబసు పక్కన శ్రీశాంత్ డ్యాన్స్ చేయనున్నాడని సమాచారం. ముందుగా ఈ పాట కోసం పోర్న్ స్టార్ సన్నీలియోనీని సంప్రదించగా ఆమె రూ. 1 కోటి డిమాండ్ చేసినట్టు చిత్ర వర్గాలు వెల్లడించాయి. అంతమొత్తాన్ని భరించలేమంటూ, వెనక్కు తగ్గిన నిర్మాతలు బిపాసాబును సంప్రదింపులు జరుపుతున్నామని చిత్రబృందం తెలిపింది.
సినిమా మొత్తంలో ఈ ఒక్క పాటే శ్రీశాంత్‌లో ఉన్న డ్యాన్స్ టాలెంట్‌ని చూపుతుందని అందుకే బాగా డ్యాన్స్ చేసే హీరోయిన్‌ని ఎంచుకోవాలనుకున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న బిపాసా ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకొంటుందో లేదో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications