For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టైగర్ సల్మాన్‌కు బర్త్ డే విష్ తెలిపిన క్రికెటర్లు

Cricketing fraternity wishes Salman Khan on his 53rd birthday

హైదరాబాద్: భారత సినీ పరిశ్రమలో అగ్ర కథనాయకుడిగా కొనసాగుతున్న సల్మాన్ ఖాన్(సల్లూ భాయ్)53వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ స్టార్ హీరో జన్మదినం సందర్భంగా మరికొందరు స్టార్లు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, ధర్మేంద్రలతో పాటు మిగిలిన సినీ దిగ్గజాలు క్రికెట్ స్టార్లు కూడా విషెస్ అందజేశారు. 1965 డిసెంబరు 27న పుట్టిన సల్మాన్ ఖాన్ ఇప్పటికీ బ్రహ్మచారిగానే ఉన్నారు. ఈ ఏడాది షూటింగ్‌లతో బిజీగా ఉన్న సల్మాన్ వచ్చే నెలలో మూడు సినిమాలకు సంతకం చేయనున్నాడట.

సలీం ఖాన్ కొడుకైన సల్మాన్ 1988లో బీవీ హో తో ఐసీ సినిమా ద్వారా అరంగ్రేటం చేశాడు. అందులో సహ నటుడి పాత్ర చేసిన సల్మాన్ ఆ తర్వాత 1989వ సంవత్సరంలో మైనే ప్యార్ కియాలో హీరో పాత్రతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత అతని కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 1990లో హమ్ ఆప్కే హై కౌన్, 1995లో కరణ్ అర్జున్‌లు వరుస హిట్లతో పాటు తిరుగులేని కథానాయకుడిగా ఎదిగారు. ఇదంతా ఒక ఎత్తైతే 2010 తర్వాత అతని స్టార్ డమ్ శిఖరాగ్రాన్ని చేరింది. హద్దంటూ లేకుండా దబాంగ్, రెడీ, ఏక్ థ టైగర్ సినిమాలతో బాక్స్ ఆఫీసును ఊపేశాడు.

ఈ సంవత్సరం యాక్షన్ థ్రిల్లర్ రేస్ 3 మూవీతో ప్లేక్షకుల ముందుకొచ్చి కొద్దిగా నిరాశపరిచాడు. కానీ, అతని నటనలో లోపాలు లేనప్పటికీ కథనం నచ్చకపోవడంతో బోల్తా కొట్టింది. సల్మాన్ క్రేజ్‌ను వాడుకునేందుకు టీవీ ఛానెళ్లు క్యూ కడుతుంటాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 12లో పలు రకాల వ్యక్తిత్వమున్న నటులతో నిర్వహిస్తోన్న రియాల్టీ షోలో పాల్గొంటున్నాడు.

సల్లూ భాయ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు ట్వీట్ల వరదలా వ్యాపిస్తున్నాయి. సినీ తారలతో పాటు అఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా సల్మాన్‌కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. అతనితో పాటు కేదర్ జాదవ్, రాహుల్ శర్మ, దీపక్ చాహర్, సురేశ్ రైనా, వినోద్ కాంబ్లీ, యూసఫ్ పఠాన్‌లు కూడా ట్వీట్ల ద్వారా విషెస్‌ను తెలియజేశారు.

Story first published: Thursday, December 27, 2018, 18:17 [IST]
Other articles published on Dec 27, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+