వికెట్ లేకుండా: విజయంతో ముగించిన నెహ్రా, చివరి ఓవర్‌లో ఉద్వేగం
హైదరాబాద్: టీమిండియా వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా క్రికెట్ కెరీర్‌కు తెరపడింది. బుధవారం తన సొంత మైదానమైన ఫిరోజ్ షా కోట్లా వేదికగా న్యూజిలాండ్‌తో తన చివరి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌తోనే క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు నెహ్రా ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే తన కెరీర్‌లో ఆడిన చివరి మ్యాచ్‌లో నెహ్రా వికెట్ తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో నెహ్రా 4 ఓవర్లు వేసి 29 పరుగులిచ్చాడు. మున్రో ఇచ్చిన సునాయసమైన క్యాచ్‌ను పాండ్యా విడిచిపెట్టడంతో నెహ్రాకు వికెట్ దక్కించుకునే అవకాశాన్ని కోల్పోయాడు. అలాగే కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇచ్చిన మరో క్యాచ్‌ను కోహ్లీ జార విడిచాడు.
ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ బౌలింగ్ వేసింది నెహ్రానే. చివరి ఓవర్లో అయినా నెహ్రాకు వికెట్ పడుతుందేమో అభిమానులు ఆశించారు. అయితే ఈ ఓవర్లో 7 పరుగులిచ్చిన నెహ్రా వికెట్ మాత్రం తీయలేకపోయాడు. ముఖ్యంగా చివరి రెండు మూడు బంతులు వేసేటపుడు నెహ్రా చాలా ఉద్వేగంగా కనిపించాడు.

కోహ్లీ చప్పట్లు చరుస్తూ
నెహ్రా తన ఆఖరి బంతి వేసేటపుడు కెప్టెన్ కోహ్లీ చప్పట్లు చరుస్తూ ఎంతో ఉత్సాహపరిచాడు. మ్యాచ్ అనంతరం నెహ్రా జట్టులోని తన సహచర క్రికెటర్లతో స్టాండ్స్ వైపు అభివాదం చేస్తూ స్టేడియమంతా తిరిగాడు. కొంత దూరం వెళ్లాక కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్ శిఖర్ ధావన్ అతడిని భుజాల మీదికి ఎత్తుకుని ఘనంగా వీడ్కోలు పలికారు.

నెహ్రా చేతుల మీదుగా కోహ్లీ బహుమతి
కోహ్లీ జూనియర్ స్థాయిలో ఆడుతున్నపుడు నెహ్రా చేతుల మీదుగా బహుమతి అందుకున్నాడు. ఇప్పుడు అదే కోహ్లీ కెప్టెన్సీలో చివరి మ్యాచ్ ఆడటం, అతనే తన భుజాల మీదికి ఎత్తుకుని తనను గౌరవించడం నెహ్రాకు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

‘ఆశిష్ నెహ్రా ఎండ్' నుంచి బౌలింగ్ చేసే అదృష్టం
అంతకాదు తనపై గౌరవంగా ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ క్రికెట్ సంఘం ఏర్పాటు చేసిన ‘ఆశిష్ నెహ్రా ఎండ్' నుంచి బౌలింగ్ చేసే అదృష్టం దక్కించుకున్నాడు. గ్రౌండ్‌లో దూసుకొచ్చి నెహ్రా కాళ్లు మొక్కే అభిమాని కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయే ఘటన కూడా ఈ మ్యాచ్‌లో మనకు కనిపించింది. క్రికెట్‌లో మహా దిగ్గజాలు సెహ్వాగ్‌కు, వీవీఎస్ లక్ష్మణ్‌కు, జహీర్ ఖాన్‌లకు కూడా సాధ్యం కాని ఫెర్‌వెల్ మ్యాచ్ నెహ్రాకు లభించింది.

నేనెప్పుడూ సంతోషంగానే ఉంటా
అనంతరం నెహ్రా మాట్లాడుతూ 'రిటైర్మెంట్‌తో నా శరీరం ఇక ప్రశాంతంగా ఉంటుంది. నేను మరో రెండేళ్లు ఆడగలనని ఇంతకుముందు చెప్పా. కానీ రిటైర్ కావడానికి ఇదే మంచి సమయం అనుకున్నా. భారత్ తరఫున అత్యధిక సార్లు ఆఖరి ఓవర్ వేసిన బౌలర్ నేనే కావొచ్చు. ఈ రోజు నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. నాకు ఏ విషయంలోనూ విచారం లేదు. రిటైరైనా కాకపోయినా, నేనెప్పుడూ సంతోషంగానే ఉంటా' అంటూ ఉద్వేగంగా మాట్లాడాడు.

నెహ్రా అనగానే అందరికీ 2003 ప్రపంచకప్‌లో 6/23 ప్రదర్శన
నెహ్రా అరంగేట్రానికి ముందు ఇద్దరు భారత లెఫ్టార్మ్ పేసర్లు మాత్రమే ఐదుకు మించి టెస్టు వికెట్లు పడగొట్టారు. కానీ, నెహ్రా మాత్రం తనదైన ప్రత్యేక శైలితో దూసుకొచ్చాడు. నెహ్రా అనగానే అందరికీ 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో 6/23 ప్రదర్శన మాత్రమే గుర్తుకొస్తుంది. దీంతో పాటు పాకిస్తాన్‌పై కరాచీ వన్డేలో, ఆ తర్వాత పాక్‌పైనే 2011 ప్రపంచ కప్ సెమీస్, గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో నెహ్రా ఆట గురించి చెబుతాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications