హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే మంగళవారం 47వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు అనిల్ కుంబ్లేకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పటిలాగే సెహ్వాగ్ తనదైన స్టైల్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.
'ధనత్రయోదశి రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న, భారత జట్టుకు ధనం లాంటి అనిల్ కుంబ్లే భాయ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. జై జై శివ్ శంభో... హ్యాపీ బర్త్‌డే జంబో' అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా కుంబ్లేతో కలిసి ఉన్న ఫోటోను సెహ్వాగ్ జత చేశాడు.
భారత్ తరఫున 132 టెస్టులాడిన కుంబ్లే 619 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధికంగా ఎనిమిది సార్లు 10 వికెట్లు, 35 సార్లు 5 వికెట్లను దక్కించుకున్నాడు. 271 వన్డేలు ఆడిన కుంబ్లే 337 వికెట్లను సాధించాడు.
2008లో అంతర్జాతీయ క్రికెట్‌కు కుంబ్లే రిటైర్మెంట్ ప్రకటించాడు. 2016 జూన్ 24న కుంబ్లే భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. కాగా, ఈ ఏడాది జూన్‌లో కుంబ్లే తన కోచ్ పదవికి రాజీనామా చేశాడు.