For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సానియా.. షోయబ్‌లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న సెలబ్రిటీలు

Cricketers congratulate Shoaib Malik and Sania Mirza for being blessed with a baby boy

హైదరాబాద్: టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా- క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందారు. మంగళవారం ఉదయం సానియా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా ఆమె భర్త షోయబ్‌ మాలిక్‌ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. 'ఈ శుభవార్తను మీతో పంచుకోవడం ఎంతో ఉద్వేగభరితంగా ఉంది. మగబిడ్డ.. నా శ్రీమతి ఎప్పటిలాగానే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మీ ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలకు కృతఙ్ఞతలు' అంటూ ట్వీట్‌ చేశాడు.

ఆమె భర్త, పాకిస్థానీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా వెల్లడించడంతో అభిమానులు, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమకు పుట్టబోయే బిడ్డకు తన ఇంటి పేరు, షోయబ్‌ ఇంటిపేరు కలిసేలా నామకరణం చేస్తామని గతంలో సానియా వెల్లడించారు. 'మీర్జా మాలిక్' పేరు ట్విటర్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.

'కంగ్రాట్స్‌. అల్లా మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి'

'ముబారక్‌'- మావ్రా హొకేన్‌ (పాకిస్థానీ నటి. బాలీవుడ్‌లో 'సనమ్‌ తేరీ కసమ్‌' చిత్రంలో నటించారు)

'చాలా కాలం తర్వాత ఓ శుభవార్త విన్నాను. కంగ్రాట్స్‌ సానియా, షోయబ్‌'- ఫరా ఖాన్‌ (బాలీవుడ్‌ దర్శకురాలు, కొరియోగ్రాఫర్)

'పాకిస్థానీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌, భారతీయ టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జాకు పండంటి మగ బిడ్డ జన్మించాడు. బాబు భారతదేశంలో పుట్టాడు కాబట్టి వాడు భారతీయుడే అవుతాడు'

Story first published: Tuesday, October 30, 2018, 16:18 [IST]
Other articles published on Oct 30, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+