Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆడటం ఇష్టంలేకపోతే క్రికెటర్లు బ్రేక్ తీసుకోవచ్చు: కపిల్ ఆసక్తికరం

Cricketers can take a break if they don't want to play: Kapil Dev

హైదరాబాద్: ఆడటం ఇష్టంలేకపోతే క్రికెటర్లు కూడా ఆట నుంచి బ్రేక్ తీసుకోవచ్చని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నాడు. క్రికెటర్లు కూడా ప్రొఫెషనల్స్ అయ్యారని కావాలంటే ఆట నుంచి విరామం తీసుకోవచ్చని ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ దేవ్ అన్నాడు.

ప్రస్తుతం క్రికెట్‌ ఎంతో ప్రొఫెషనలిజం సంతరిం చుకుందని, ఆటగాళ్లు ఆడాలనుకోకపోతే బ్రేక్‌ తీసుకుని విశ్రాంతి పొందవచ్చని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో బిజీ షెడ్యూల్‌, ఒత్తిడి కారణంగా ఆటగాళ్లకు విరామం ఎంతో అవసరమని సూచించాడు.

అంతర్జాతీయ క్రికెటర్లు పరిణితితో ఉంటారని, ఆట నుంచి ఎపుడు బ్రేక్‌ తీసుకోవాలో వారికి తెలుసుని కపిల్ దేవ్ పేర్కొన్నాడు. ప్రొఫెషనల్‌ క్రికెటర్లు మీడియాకు వ్యాసాలు రాయకూడదన్న నిషేధం ఉందని, అదే సరదాకు ఆడేవారి విషయం వేరేలా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పాడు.

Kapil, Dhoni, Sourav together on a cricket pitch

'నేటి క్రికెటర్లు ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటున్నారు. వారు ఆడదలచుకోకపోతే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడంలో తప్పులేదు. అయితే నేటి పోటీప్రపంచంలో తీరికలేని క్రికెట్‌ ఆడుతున్నామనడంతో ఏకీభవించను. ఎవరి అభిప్రాయం వారిది' అని కపిల్‌ అన్నాడు.

ప్రస్తుత భారత్‌ జట్టు ఎంతో మెరుగ్గా ఆడుతోందని, గత 10-15 సంవత్సరాలుగా మన జట్టు ఎన్నో విజయాలు సాధించడం గర్వంగా ఉందని కపిల్ తెలిపాడు. 'నిజంగా టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. ప్రస్తుతం కోహ్లీసేన ఎంతో మెరుగ్గా రాణిస్తోంది. గత 10-15 ఏళ్లుగా భారత జట్టు ప్రదర్శన అద్భుతం' అని కపిల్ అన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, November 22, 2017, 9:36 [IST]
Other articles published on Nov 22, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+