Cricketers Heartbroken In Love Life: భారత క్రికెటర్లు తమ కెరీర్‌తో పాటు ప్రేమ జీవితాల విషయంలోనూ తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. కొందరు స్టార్ ఆటగాళ్ల మనసును బాలీవుడ్ సుందరాంగులు విరగ్గొట్టారు. ఈ దిగ్గజ ఆటగాళ్ల ప్రేమకథలు బాలీవుడ్ నటీమణులతో చర్చనీయాంశంగా మారినప్పటికీ ఆ ప్రేమబంధం పెళ్లివరకు చేరలేకపోయింది. ఆ క్రికెటర్లు.. వారి ప్రేమ కథల గురించి తెలుసుకుందాం.
రవిశాస్త్రి-అమృత సింగ్ బంధం
భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి తన క్రికెట్ కెరీర్ సమయంలో అమృత సింగ్‌ను ప్రేమించాడు. ఆ సమయంలో అమృత సింగ్ కెరీర్ కూడా పీక్ స్టేజ్‌లో ఉంది. వీరి ప్రేమ ఒక మ్యాగజైన కవర్ ఫోటో షూటింగ్ సమయంలో మొదలైంది. రవిశాస్త్రి న్యూయార్క్‌లో అమృతకు ప్రపోజ్ చేశాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల వీరి బంధం విచ్ఛిన్నమైంది.

యువరాజ్ సింగ్-కిమ్ శర్మల ప్రేమకథ
భారత క్రికెట్ దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్, కిమ్ శర్మల బంధం చాలా కాలం కొనసాగింది. వీరిద్దరూ చాలా కాలం పాటు డేటింగ్ చేశారు. కానీ మీడియా ముందు యువరాజ్, కిమ్ ఇద్దరూ ఎప్పుడూ తమ బంధాన్ని ధ్రువీకరించలేదు. యువరాజ్ సింగ్ ఇప్పుడు హేజల్ కీచ్‌ను వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నారు.
మహీ లవ్ లైఫ్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టాలీవుడ్ నటి రాయ్ లక్ష్మితో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 2008-2009 సమయంలో ధోనితో రాయ్ లక్ష్మి కనిపించింది. టాలీవుడ్ నటితో బంధం తెగిపోయిన అనంతరం ధోని సాక్షిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు వారికి జీవా ధోని అనే కుమార్తె కూడా ఉంది.
ఇమ్రాన్ ఖాన్ ప్రేమలో జీనత్ అమన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్, బాలీవుడ్ ప్రముఖ నటి జీనత్ అమన్‌ల మధ్య బంధం ప్రేమగా మారింది. 1970ల ప్రాంతంలో ఇమ్రాన్ ఖాన్ మ్యాచ్‌లు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చాడు. ఆ సమయంలో ఇమ్రాన్ అనేక మంది నటీమణులతో ప్రేమ వ్యవహారాలు సాగించినట్లు ప్రచారం జరిగింది. ఒకసారి ఇమ్రాన్ తన పుట్టినరోజును జీనత్‌తో జరుపుకోవడానికి తన జట్టుకు అబద్ధం చెప్పి వెళ్ళాడని చెబుతారు. అయితే, ఇమ్రాన్ ఖాన్, జీనత్ అమన్ తమ బంధం గురించి ఎప్పుడూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.