
హైదరాబాద్: రూమర్లే రియలైయ్యాయ్. అందమైన అపోహలే అపురూప బంధం నిజమేనని తేల్చింది. వారం రోజుల నుంచి క్రికెట్ అభిమానులతో పాటు భారత్ మొత్తం మాట్లాడుకుంటున్న విషయం ఒక్కటే ఒక్కటి. భారత్ స్టార్ క్రికెటర్, టీమిండియా కెప్టెన్ కోహ్లీ 48 రోజులు సెలవు ఎందుకు తీసుకున్నాడు.. ? అదే సమయానికి అనుష్క ఎందుకు అందుబాటులో లేదు.? వారిద్దరూ ముంబై ఎయిర్ పోర్టులో కన్పించి ఏమీ లేదనడం ఏంటి..?
విరుష్క వివాహ వేడుక:
మిలాన్ (ఇటలీ)లోని టుస్కానీలో ఓ ఖరీదైన రిసార్టులో అత్యంత వైభవంగా ఈ వేడుక జరిగింది. పూర్తి ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొద్ది మంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. పూర్తిగా పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచీ ముఖర్జీ డిజైన్ చేసిన పింక్ లెహంగాలో అనుష్క సిగ్గుల మొగ్గ అయిపోగా.. సంప్రదాయ షేర్వాణిలో విరాట్ మెరిసిపోయాడు. పెండ్లి తంతు ముగిసిన తర్వాత విరుష్క జంట.. తమ ప్రేమ బంధానికి అక్షర రూపమిచ్చింది. వారి ప్రేమ అలానే జీవితాంతం కొనసాగాలని పరస్పరం వాగ్దానం చేసుకున్నారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడమే నిజమైన అశీర్వాదమంటూ మురిసిపోయారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.