స్నేహ దీప్తి సంచలనం: వన్డేలో ట్రిపుల్ సెంచరీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహిళా క్రికెటర్ స్నేహదీప్తి సంచలనం సృష్టించింది. ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) నార్త్‌జోన్ మహిళల క్రికెట్ పోటీల్లో ఒక్క రోజే 350 పరుగులు చేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది. స్నేహ దీప్తి ఎదుర్కొన్న 166 బంతుల్లో 58 ఫోర్లు, 11 సిక్స్‌ల సాయంతో ట్రిపుల్ సెంచరీ (350 పరుగులు) సాధించింది.
దీంతో ఆంధ్ర అండర్-19 క్రికెటర్ హారికా యాదవ్ పేరిట ఉన్న 308 పరుగుల వ్యక్తిగత రికార్డు బద్దలైంది. కాగా, ఈ రెండు రికార్డులూ విజయనగరంలోని ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కళాశాల లోనే నమోదయ్యాయి. స్నేహ దీప్తి విశాఖపట్నం తరుపున బరిలోకి దిగింది.

దీప్తి అత్యుత్తమ ప్రదర్శనతో శ్రీకాకుళంపై విశాఖపట్నం 503 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విశాఖపట్నం 50 ఓవర్లలో 4 వికెట్లకు 608 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీకాకుళం 24.5 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో శ్రీకాకుళం జట్టుపై 503 పరుగుల ఆధిక్యంలో విజయం సాధించింది. శ్రీకాకుళం జట్టులో అత్యధికంగా హారికా యాదవ్ 80 పరుగులు చేసింది. స్నేహ దీప్తి 4 వికెట్లు కూల్చగా, హిమ బిందు 2 వికెట్లు తీసింది
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications