ఓ కొత్త వెబ్ సిరీస్ ప్రమోషన్ ఈవెంట్‌లో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు స్టార్లు బహిరంగంగా తిట్టుకుంటూనే కొట్లాటకు దిగారు. ఈ క్రమంలోనే ఒకరిపైమరొకరు చేయి కూడా చేసుకున్నారు! అయితే అక్కడే ఉన్న టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ వాళ్ల మధ్య గొడవ ఆపేందుకు ప్రయత్నించాడు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే?
ఆ ఇద్దరే కొట్టకుంది..
పాపులర్ రియాలిటీ షోస్ సెలబ్రిటీస్ రజత్ దలాల్, ఆశిమ్ రియాజ్, రుబినా దిలైక్, శిఖర్ ధావన్ సహా పలువురు కలిసి ఓ కొత్త ఓటీటీ సిరీస్ ను లాంఛ్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా వీళ్లంతా తాజాగా నిర్వహించిన ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అయితే షో కొనసాగుతుండగా.. ఏం జరిగిందో తెలీదు కానీ అశిమ్ రియాజ్, రజత్ దలాల్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఆ గొడవ పెద్దదిగా మారిపోయింది. ఇద్దరు కొట్టుకునే దాకా వెళ్లిపోయారు. ఒకరిపై మరొకరు చేయి కూడా చేసుకున్నారు.

గొడవ ఆపేందుకు ప్రయత్నించిన ధావన్..
ఈ గొడవ జరుగుతుండగా.. వెంటనే అక్కడే ఉన్న స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ వాళ్ల మధ్యలోకి వివాదాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. అయినా కూడా అశిమ్, రజత్ అస్సలు తగ్గలేదు. ఒకరిపైకి మరొకరు రెచ్చిపోతూనే ఉన్నారు. చివరికి ఎలాగోలా శిఖర్ ధావన్ గొడవను సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు నిజంగానే కొట్లాడుకున్నారా, లేదంటే ప్రమోషనల్ స్టంటా అనే అనుమానిస్తున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వస్తేగానీ తెలీదు.