
శాంతివనంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా
రోహిత్ శర్మ మాట్లాడుతూ శాంతివనంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందని అన్నాడు. నేచర్‌కు దగ్గరగా ఉంటే పాజిటివిటి పెరుగుతుందని చెప్పాడు. ధ్యానం చేయడం వల్ల సానుకూల దృక్పథం మరింతగా పెంపొందించుకోవచ్చని సూచించాడు. ఆశ్రమ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను రోహిత్ అభినందించాడు.

ధ్యానం వల్ల ఎన్నో లాభాలున్నాయి
ధ్యానం వల్ల ఎన్నో లాభాలున్నాయని, తను కూడా ఎంతగానో లబ్ధి పొందానని అన్నాడు. రామచంద్ర మిషన్‌కు తన సహచర క్రికెటర్లను తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పాడు. అనంతరం రామచంద్ర మిషన్ మార్గదర్శకుడు కమలేష్ పటేల్ మాట్లాడుతూ రోహిత్ శర్మ యువతకు స్ఫూర్తిదాయకమని, అందుకే స్టేడియానికి అతడి పేరు పెడుతున్నామని అన్నారు.

త్వరలోనే నిర్మాణ పనులు
త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పుకొచ్చారు. దేశానికి ఉత్తమ క్రీడాకారులను అందించే లక్ష్యంతో స్టేడియం, శిక్షణ కేంద్రం నిర్మించబోతున్నట్లు ఆయన తెలిపారు. ఆశ్రమ అభ్యాసీలతో పాటు ప్రతిభావంతులందరికీ ఈ స్టేడియం అందుబాటులో ఉంటుందని అన్నారు. కొత్త ఏడాదిని టీమిండియా టీ20లతో ఆరంభించనుంది.

గువహటి వేదికగా తొలి టీ20
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆదివారం గువహటి వేదికగా తొలి టీ20 జరగనుంది. ఆదివారం గువహటిలో ప్రారంభమయ్యే తొలి టీ20తో ఈ సిరిస్ ప్రారంభమవుతుంది. ఈ సిరిస్ నుంచి రోహిత్ శర్మకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం కోచ్‌ల పర్యవేక్షణలో కొంతమంది ఆటగాళ్లు నెట్‌ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications












