ముంబై: టీమిండియా యువ క్రికెటర్ రోహిత్ శర్మ ముంబైలోని బాంద్రా వర్లీ ప్రాంతంలో రూ. 30 కోట్లతో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ప్రముఖులు నివాసముండే 53 అంతస్తుల అహూజా టవర్స్‌లో 29వ అంతస్తులో ఉన్న ఈ ప్లాట్‌లో నాలుగు బెడ్ రూమ్‌లు ఉన్నాయి.
బాంద్రా-వర్లీ సీ లింకుకు దగ్గరిలో ఉన్న అహుజా టవర్స్ ప్రాంతం రోహిత్ శర్మను బాగా ఆకర్షించిందట. అంతేకాదు ఇక్కడ నుంచి వాంఖడె స్డేడియానికి వెళ్లేందుకు 20 నిమిషాలు పడుతుంది. ముంబై విమానాశ్రయానికి కూడా ఇంతే సమయం పడుతుంది.

ఈ ప్లాట్ నుంచి చూస్తే బాంద్రా-వర్లీ సీ లింక్ అద్భుతంగా కనిపిస్తుంది. రోహిత్ తనకు అత్యంత అనకూలమైన నివాసాన్ని ఎంచుకున్నాడని అతని బిజినెస్ మేనేజర్ బంటీ సజ్‌దే అన్నారు. దీనిపై అహూజా కన్ స్ట్రక్షన్స్ ప్రతినిధి మాట్లాడుతూ భారత్ క్రికెట్ ఐకాన్ తమ భవన సముదాయంలోని ప్రముఖుల్లో ఒకడవడం సంతోషమని పేర్కొన్నారు.