For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'#మీటూ': ద్రవిడ్ రూమ్‌లో అమ్మాయి... ఏం చేశాడో తెలుసా? (వీడియో)

Cricketer Rahul Dravid Reacts for an young girls proposal Goes Viral.

హైదరాబాద్: '#మీటూ' ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తనుశ్రీదత్తా మొదలెట్టిన ఈ రచ్చ, ఇప్పుడు కేవలం సినిమా రంగానికి పరిమితం కాకుండా మీడియా, రాజకీయ రంగాల నుంచి క్రికెట్ దాకా వ్యాపించిన సంగతి తెలిసిందే.

అయితే, టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ ఈ వివాదంలో చిక్కుకోకుండా అత్యంత పరిణతిని ప్రదర్శించి తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాహుల్‌ ఓ హోటల్‌ గదిలో ఉండగా అక్కడకు వచ్చిన ఓ యువతి ద్రవిడ్‌కు పెళ్లి ప్రతిపాదన తెచ్చింది.

ద్రవిడ్‌ అంగీకరించకపోవడంతో

ఈ సమయంలో ఆ యువతి రాహుల్ ద్రవిడ్‌ను ముట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే, ఇందుకు ద్రవిడ్‌ అంగీకరించకపోవడంతో బయటే ఉన్న తన తండ్రిని పిలిచి పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ, ద్రవిడ్‌ మాత్రం 20 ఏళ్ల వయస్సులో చదువు, కెరీర్‌పై దృష్టి పెట్టాలని ఆ అమ్మాయికి బుద్ధి చెప్పి పంపించివేశారు. అయితే, ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లంక పేసర్ లసిత్ మలింగపై ఓ బాధితురాలు

లంక పేసర్ లసిత్ మలింగపై ఓ బాధితురాలు

ఇక, క్రికెటర్ల విషయానికి వస్తే ఇప్పటికే ఇద్దరు శ్రీలంక క్రికెటర్లపై ఈ ఆరోపణలు వచ్చాయి. #మీటూ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఓ బాధితురాలు మలింగా బాగోతాన్ని బయటపెట్టింది. ఇప్పుడు, ఆ విషయాన్ని టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద తన ట్విట్టర్ ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేసింది. "కొన్నేళ్ల క్రితం ముంబైలోని ఓ హోటల్‌లో నాకు చేధు అనుభవం ఎదురైంది. ఆ హోటోల్లో నా స్నేహితురాలితో కలిసి బస చేసాను. అది ఐపీఎల్‌ సీజన్‌ కావడంతో శ్రీలంక ఫేమస్‌ క్రికెటర్‌ మలింగా కూడా అదే హోటల్లో బస చేశారు. ఒకరోజు నా స్నేహితురాలి కోసం ఎదురు చూస్తుంటే ఒకరు ఆమె మలింగా రూమ్‌లో ఉందని చెప్పారు. దీంతో నేను ఆ గదిలోకి వెళ్లగా అక్కడ ఆమె లేదు.

"మలింగా మాత్రం నన్ను బెడ్‌పైకి తోసేసి అసభ్యంగా ప్రవర్తించాడు. నా ఫేస్‌ను తడిమాడు. అతనితో పోటీపడి నాకు నేను రక్షంచుకోలేనని గ్రహించాను. ఏం చేయలేక కళ్లు మూసుకుని నిశబ్దంగా ఉండిపోయాను. ఆ తర్వాత కొద్దిసేపటికి హోటల్‌ సిబ్బంది డోర్‌ కొట్టారు. అతను వెళ్లి డోర్‌ తీశాడు. నేను వెంటనే వాష్‌ రూమ్‌కు వెళ్లి నా ముఖాన్ని కడుక్కున్నాను.

"హోటల్‌ సిబ్బంది బయటకు వెళ్లే లోపే ఆ రూమ్ నుంచి బయటపడ్డాను. ఇది నాకు చాలా అవమానకరంగా అనిపించింది. నాకు తెలిసిన కొంత మందికి ఈ విషయం చెబితే.. వారు తప్పంతా నాదే అన్నట్లు మాట్లాడారు. నీవే అతని రూమ్‌కు వెళ్లావని, అదికాక అతనో క్రికెటరని, కావాలనే ఇలా చేశావంటారని తెలిపారు" అని సదరు యువతి తన గోడును చిన్మయికి వెళ్ళబోసుకుంది.

 అర్జున రణతుంగ విషయానికి వస్తే

అర్జున రణతుంగ విషయానికి వస్తే

"ముంబైలోని హోటల్‌ జూహు సెంటర్‌ ఎలివేటర్‌లో భారత, శ్రీలంక క్రికెటర్లు ఉన్నారని తెలిసి నా స్నేహితురాలు ఆటోగ్రాఫ్‌ తీసుకోవడానికి వెళ్దామని పట్టుపట్టింది. అలా ఆమెతో పాటుగా నేను కూడా వెళ్లాల్సి వచ్చింది. కానీ కాసేపటి తర్వాత తను స్విమ్మింగ్‌పూల్‌ వైపుగా పరిగెత్తింది. నేను కూడా తనని అనుసరించాను. తర్వాత తను కనిపించలేదు.

అదే సమయంలో హోటల్‌ రూం నుంచి బయటికి వచ్చిన రణతుంగ స్విమ్మింగ్‌పూల్‌ దగ్గర నిలబడి ఉన్నాడు. నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు. నేను కూడా అతడిని విష్‌ చేశాను. కానీ అంతలోనే నాకు అతి సమీపంగా వచ్చి చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. వికృత చేష్టలతో నన్ను చుట్టేశాడు. నాకు చాలా భయం వేసింది. కానీ వెంటనే తేరుకుని అతడిని వదిలించుకునేందుకు గట్టిగా తన్నడం మొదలుపెట్టా.

నీ పాస్‌పోర్టు క్యాన్సిల్‌ చేయిస్తా, పోలీసులకు చెబుతా అంటూ అరిచాను. అతడి నుంచి ఎలాగోలా తప్పించుకుని హోటల్‌ రిసెప్షన్‌లో కంప్లైంట్‌ చేశాను. కానీ ఇది మీ ప్రైవేట్‌ మ్యాటర్‌. మేమేం చేయలేమంటూ సిబ్బంది చేతులెత్తేశారు" అంటూ అర్జున రణతుంగ తనతో ప్రవర్తించిన తీరును ఓ భారత ఎయిర్‌హోస్టెస్‌ బహిర్గతం చేసింది.

 రాహుల్ జోహ్రీని వివరణ కోరిన సీఓఏ

రాహుల్ జోహ్రీని వివరణ కోరిన సీఓఏ

కాగా, బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రీ తనను లైంగిక వేధింపులకు గురి చేశాండంటూ ఓ మహిళా జర్నలిస్ట్ ఆరోపించింది. దీనికి సంబంధించిన వివరాలతో పాటు స్క్రీన్‌ షాట్లను జత చేస్తూ 'రాహుల్‌ జోహ్రి... నీ సమయం ముగిసింది' అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ జత చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ(సీఓఏ) రాహుల్ జోహ్రీ వివరణ ఇవ్వాలని కోరిన సంగతి తెలిసిందే. ఆయన వారం రోజులు గడువు అడిగారని, సమాధానం వచ్చాక తదుపరి చర్యలపై ఆలోచిస్తామని సీఓఏ ఒక ప్రకటనలో పేర్కొంది.

Story first published: Sunday, October 21, 2018, 10:28 [IST]
Other articles published on Oct 21, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+