Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Prithvi Shaw: ట్రోల్ పై ఆవేదన వ్యక్తం చేసిన పృథ్వీ షా..!

ముంబై బ్యాటర్ పృథ్వీ షా తీవ్ర అవమానం జరిగింది. ఐపీఎల్ 2025 వేలంలో రూ. 75 లక్షల బేస్ ధర ఉన్నప్పటికీ అతన్ని కొనుగోలు చేసేందుకు ఒక్క ప్రాంచేజీ కూడా ముందుకు రాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన షాను ఎవరు కొనుగోలు చేయలేదు. సరైన ఫామ్ లో లేకపోవడంతో అతన్న కొనుగోలు చేయడానికి ఏ జట్టు
పోటీ పడలేదు. తాజాగా షాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై పృథ్వీ షా స్పందించాడు. ఓ వీడియో కూడా విడుదల చేశాడు. అతను ఐపీఎల్ వేలం 2025లో అమ్ముడం కాకపోవడంతో మూడు రోజుల క్రితం "ఫోకస్డ్ ఇండియన్" అనే యూట్యూబ్ ఛానెల్‌ ఓ వీడియో పోస్ట్ చేసింది.

తను కెరీర్ మొత్తంలో ట్రోలింగ్ ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ట్రోల్ చేసేవారు తనను అనుసరిస్తారని చెప్పాడు. బాగుంది. ట్రోలింగ్ కొన్నిసార్లు బాధించవచ్చని అని చెప్పాడు. ఇది మంచిది కాదు.. అలాగని చెడ్డది కాదని పేర్కొన్నాడు. సమతుల్యత పాటించాల్సి అవసరం ఉందని చెప్పాడు. "ట్రోలింగ్ చేయడం మంచిది కాదని నేను భావిస్తున్నాను, కానీ అది అంత చెడ్డ విషయం కూడా కాదు" అని షా వివరించాడు. తనపై చేసిన మీమ్స్‌, పోస్ట్‌లను చూస్తుంటానని షా వెల్లడించారు.

Cricketer Prithvi Shaw responds to trolls on social media

ప్రజలు తనపై మీమ్స్ పోస్ట్ చేస్తే, తాను వాటిని కూడా చూస్తానని తెలిపాడు. తాను కొన్నిసార్లు బాధపడినట్లు వివరించాడు. తన పుట్టిన రోజు నాడు ఎలా ట్రోల్ చేశారో షా గుర్తు చేశాడు. షా విడుదల చేసిన వీడియో విస్తృత చర్చకు దారితీసింది. అభిమానులు, విమర్శకులు దీనిని వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేస్తున్నారు. చాలా మంది వినియోగదారులు క్రికెటర్‌కు రక్షణగా నిలిచారు. నైపుణ్యాలు, ఆటతీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు.

పృథ్వీ షా మరింత బలంగా తిరిగి వస్తాడని తాను భావిస్తున్నట్లుగా ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఒడిదుడుకులు జీవితంలో భాగమని మరొకనెటిజన్ కామెంట్ చేశాడు.
షా ఎక్కడ తప్పు చేశాడో అతనికి తెలుసు. దానిని పరిష్కరించుకోవడం అతని ఇష్టమని పేర్కొన్నాడు. ఐపీఎల్ వేలంలో పృథ్వీ షా బేస్ ధర రూ.75 లక్షలు ఉన్నప్పటికీ అమ్ముడుపోకుండా పోవడంతో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్ర నిరాశను వ్యక్తం చేశాడు. ఢిల్లీ పృథ్వీ షాకు చాలా మద్దతు ఇచ్చిందని గుర్తు చేశాడు. అతను పవర్‌ప్లేలో ఆధిపత్యం చెలాయించగలడని, ఒక ఓవర్‌లో ఆరు బౌండరీలు కొట్టగలడని వారు నమ్మారన చెప్పాడు. అతను ఒకే ఓవర్‌లో ఆరు ఫోర్లతో శివమ్ మావిని చిత్తు చేశాడని కైఫ్ చెప్పాడు. అయితే, అతని అపారమైన సామర్థ్యం ఉన్నప్పటికీ, షా నిలకడగా అందించడంలో విఫలమయ్యాడని వివరించాడు

Story first published: Wednesday, November 27, 2024, 15:20 [IST]
Other articles published on Nov 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+