ప్రపంచ క్రికెట్ నివ్వెరపోయిన సంఘటన: ఫిలిప్ హ్యూస్ మరణానికి ఐదేళ్లు

హైదరాబాద్: దేశవాళీ క్రికెట్‌లో బంతి తగిలి మరణించిన క్రికెటర్ ఫిలిప్ హ్యూస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా నివాళి అర్పించింది. ఐదో వర్ధంతి సందర్భంగా అతడి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో భాగంగా 2014, నవంబర్ 25న సిడ్నీ క్రికెట్ మైదానంలో సౌత్ ఆస్ట్రేలియా, న్యూసౌత్ వేల్స్ తలపడ్డాయి.

ప్రత్యర్థి జట్టు బౌలర్ విసిరిన బౌన్సర్
ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు బౌలర్ విసిరిన బౌన్సర్ సౌత్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఫిలిప్ హ్యూస్ తలకు బలంగా తాకడంతో అక్కడిక్కడే మైదానంలో కుప్పకులాడు. హెల్మెట్ ధరించినప్పటికీ బంతి ఎడమచెవి కింది భాగంలో బలంగా తాకడంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు.

రెండు రోజుల తర్వాత
అయితే, రెండు రోజుల తర్వాత అతడు కన్నుమూశాడు. మరణించే నాటికి ఫిలిఫ్ హ్యూస్ వయసు 25 ఏళ్లు. అతడు చనిపోయి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా అతడి సేవలను క్రికెట్ ఆస్ట్రేలియా స్మరించుకుంది. ఈ సందర్భంగా సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో ఒక్కరోజైనా హ్యూస్ లేని లోటును క్రికెట్ ఆస్ట్రేలియా పూడ్చలేకపోయిందని అన్నారు.

ఆసీస్ తరుపున 25 టెస్టులు, 24 వన్డేలు
ఆస్ట్రేలియా జట్టు తరుపున 25 టెస్టులు, 24 వన్డేలకు ఫిలిప్ హ్యూస్ ప్రాతినిధ్యం వహించాడు. ఫిలిప్ హ్యూస్‌కు జరిగిన దానిని దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లు నెక్ గార్డులు ధరించాలని క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశించింది. అయితే, క్రికెటర్లకు ఇబ్బందిగా ఉంటుందని చాలామంది వాటిని ధరించడం లేదు.

ఆర్చర్ వేసిన బౌన్సర్ స్టీవ్ స్మిత్ తలను
ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా జరిగిన యాషెస్ సిరిస్‌లో జోఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్ స్టీవ్ స్మిత్ తలను బలంగా తగిలింది. ఆ తర్వాత నెక్‌గార్డ్ ధరించి 211 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ భవిష్యత్తులో కూడా నెక్ గార్డ్ ధరిస్తానని తెలిపాడు. ఈ నేపథ్యంలో నెక్ గార్డుల్ని తప్పనిసరి చేయాలని ఐసీసీ సైతం భావిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications