Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BGT సిరీస్ లో సెంచరీ - మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన టీమిండియా క్రికెటర్‌

ఇటీవలే జరిగిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన టీమిండియా యంగ్ ఆల్ రౌండర్ , తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి తాజాగా తిరుమలలో ప్రత్యక్షమయ్యాడు. ఆస్ట్రేలియా టూర్ నుంచి ఏపీకి వచ్చిన అతడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్ళాడు. వైకుంఠ ద్వారం గుండా ఏడుకొండలవాడిని దర్శించుకున్నాడు.

అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన ఏడుకొండలపైకి వెళ్లిన నితీశ్ కుమార్ రెడ్డి తిరుమలేశుడిని దర్శనం చేసుకున్నాడు. అంతేకాదు మోకాళ్ల పర్వతం దగ్గర మోకాళ్లతో మెట్లను ఎక్కి మరీ వెళ్లి గోవిందుడి ఆశీస్సులు పొందాడు. తన మొక్కు తీర్చుకునేందుకు ఇలా మోకాలపై నడిచాడు నితీశ్. చాలా మంది భక్తులు ఇలాగే చేస్తారు. ఇందులో భాగంగానే నీతీశ్ కుమార్ రెడ్డి కూడా తన మొక్కు చెల్లించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడాతడు. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది.

cricketer Nitish Kumar Reddy visit Tirupati temple lord venkateswara by climbing stairs

సెల్ఫీలు దిగిన ఫ్యాన్స్
కాగా, తిరుమలకు చేరుకున్న నితీశ్ కుమార్ రెడ్డిని టీటీడి పాలక బృందం ఘన స్వాగతం పలికింది. అయితే తిరుమల వెళ్లిన నితీశ్ కుమార్ రెడ్డిని చూసేందుకు అక్కడి ఉన్న శ్రీవారి భక్తులు ఎగబడ్డారు. అతడితో సెల్ఫీలు కూడా దిగారు. దీనికి సంబంధించిన ఫొటోలు,

కాగా, ఇటీవలే ఆస్ట్రేలియాలో ముగిసిన బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. పేస్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన అతడు.. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. జట్టును ఫాల్ ఆన్‌ గండం నుంచి బయటపడేశాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో తన తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 171 బంతుల్లో 10 ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌తో పరుగుల వరద పారించాడు.

ప్రస్తుతం ఇంగ్లాండ్‌ తో జరగబోయే టీ20 సిరీస్ కు ఎంపికయ్యాడు నితీశ్ కుమార్ రెడ్డి. తొలి మ్యాచ్ ఈ నెల 22వ తేదీన జరగనుంది. మొత్తంగా ఈ సిరీస్ లో ఐదు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనుంది భారత్.

Story first published: Tuesday, January 14, 2025, 9:43 [IST]
Other articles published on Jan 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+