మంత్రిగా క్రికెటర్ మనోజ్ తివారీ.. దూసుకుపోతున్న పొలిటికల్ ఇన్నింగ్స్!

Cricketer Manoj Tiwary is now West Bengal Minister of State for Youth and Sports
Manoj Tiwary కి మంత్రి పదవి, Ashoke Dinda డెబ్యూ అదుర్స్ | West Bengal || Oneindia Telugu

కోల్‌కతా: భారత క్రికెటర్‌గా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయిన మనోజ్ తివారీ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం దూసుకుపోతున్నాడు. ఎమ్మెల్యేగా పొలిటికల్ ఇన్నింగ్స్ ఆరంభించిన తొలిసారే మంత్రి పదవి అందుకున్నాడు. సోమవారం కొలువు దీరిన మమతా బెనర్జీ నేతృత్వంలోని జంబో కాబినేట్‌లో మనోజ్ తివారీ యువజన, క్రీడా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. మొత్తం 43 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. అందులో 24 మంది పూర్తి స్థాయి మంత్రులుగా, 10 మంది సహాయ మంత్రులు, మరో 9 మంది స్వతంత్ర మంత్రులుగా సేవలు అందించనున్నారు.

ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మనోజ్ తివారీ షిబ్‌పూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. గత ఫిబ్రవరిలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన మనోజ్‌కు టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ షిబ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి చెందిన రథిన్ చక్రవర్తిపై తివారీ 6వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.

మనోజ్ తివారీ భారత్ తరఫున 2008లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 12 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. జట్టులోని సీనియర్ల కారణంగా అతను అవకాశాలు అందుకోలేకపోయాడు. సెంచరీ చేసిన మరుసటి మ్యాచ్‌కే అతను బెంచ్‌కు పరమితమయ్యాడు. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన అతనికి 2018 ఐపీఎల్ సీజన్ చివరిది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తం 98 మ్యాచ్‌లు ఆడిన తివారీ 7 హాఫ్ సెంచరీలతో 1695 పరుగులు చేశాడు. ఓ వికెట్ కూడా తీశాడు. అయితే తివారీ ఇప్పటి వరకు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించకపోవడం గమనార్హం.

పశ్చిమ బెంగాల్‌ శాసన సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 292 నియోజక వర్గాలకు ఎన్నికలు నిర్వహించగా.. ఏకంగా 213 సీట్లను కైవసం చేసుకుంది. 77 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఇక మరో క్రికెటర్ అశోక్ దిండా సైతం అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అతను కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, May 10, 2021, 19:05 [IST]
Other articles published on May 10, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X