హైదరాబాద్: భారత జట్టులో ఒక వెలుగు వెలిగిన పఠాన్ సోదరులు తమలో దాగి ఉన్న మరో టాలెంట్‌ని అభిమానులకు చూపించారు. పఠాన్ సోదరులు బాలీవుడ్ సినిమాలోని పాటలను పాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.
తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్లను హడలెత్తించిన ఇర్ఫాన్ పఠాన్ సింగర్‌గా మారిపోయి అద్భుతమైన పాట పాడాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ''బద్రినాథ్ కీ" అంటూ పాటను పాడి ఆ వీడియోను భార్యకు అంకితం చేశాడు. మరోవైపు ఇర్ఫాన్ పఠాన్ సోదరుడు యూసఫ్ పఠాన్ కూడా పాట పాడాడు.
వీరిద్దరూ ఒకరు పాడిన పాటను మరొకరు ట్విట్టర్‌లో అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ పాటలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీమిండియా వెటరన్ స్ఫిన్నర్ హర్భజన్ సింగ్ కూడా సింగర్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రముఖ సంగీత దర్శకుడు మిథూన్ అందించిన స్వరాలకు భజ్జీ పాట పాడనున్నాడు.