Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇర్ఫాన్ పఠాన్‌కు ప్రమోషన్: మగబిడ్డకు జన్మనిచ్చిన భార్య

హైదరాబాద్: టీమిండియా సీనియర్ ఆటగాడు, బరోడా ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తండ్రి అయ్యాడు. తాను తండ్రి అయిన విషయాన్ని ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఇర్ఫాన్ పఠాన్ భార్య సాఫా బేగ్ మంగళవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఇర్ఫాన్ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది.

ఇర్ఫాన్ పఠాన్ సోదరుడు, టీమిండియా ఆటగాడు యూసఫ్ పఠాన్ కూడా ఈ విషయం పై ట్వీట్ చేశాడు. మా ఇంట్లోకి కొత్త పఠాన్‌కు స్వాగతమంటూ పెదనాన్న అయ్యానన్న సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. అయాన్, రయాన్‌లకు తమ్ముడు దొరికేశాడని ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జెడ్డాకు చెందిన మోడల్ సఫా బేగ్‌తో మక్కాలో ఇర్ఫాన్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది బరోడా జట్టుకు ఇర్ఫాన్ పఠాన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే రంజీల్లో బరోడా జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించలేదు. పఠాన్ సోదరులు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించి ఎన్నో విజయాలు అందించారు.

Cricketer Irfan Pathan becomes a proud father, blessed with a baby boy

2003లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఇర్ఫాన్ పఠాన్ చివరిసారిగా భారత్ తరుపున టెస్టు మ్యాచ్‌ని 2008లో ఆడాడు. 29 టెస్టులాడిన ఇర్ఫాన్ పఠాన్ 100 వికెట్లు తీశాడు. 2012లో శ్రీలంకపై చివరిసారిగా వన్డే మ్యాచ్ ఆడాడు. మొత్తం 120 వన్డేలాడిన పఠాన్ 173 వికెట్లు తీసుకుని 1544 పరుగులు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+