సియట్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా హర్మన్ ప్రీత్ కౌర్
హైదరాబాద్: భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రముఖ టైర్ల తయారీ సంస్థ సియట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఇక ముందు తన బ్యాట్‌పై సియట్ లోగోను ప్రదర్శించనుంది. ఇప్పటి వరకు సియట్‌తో ఒప్పందం కుదుర్చుకున్న మొదటి మహిళా క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ నిలిచింది.

గతేడాది దూసుకెళ్లి..:
ఈ సందర్భంగా హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. ‘సియట్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు సియట్‌తో ఒప్పందాలు చేసుకున్నారు. 2017 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై 171 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. మహిళల బిగ్‌బాష్ టి20 లీగ్‌లో ఆడిన తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.

యువ క్రీడాకారులకు ఆదర్శవంతురాలు
ఈ ఏడాది అదే జోరును కొనసాగించాలని ఆశిస్తున్నాను' అని తెలిపింది. ‘హర్మన్‌ను మా సంస్థలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉంది. ఆమె యువ క్రీడాకారులకు ఆదర్శవంతురాలు' అని సియట్ లిమిటెడ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ నితీశ్ బాలాజీ అన్నారు.

భారీగానే ముట్టచెప్పారు:
రెండేళ్లకుగాను ఒప్పందం కుదుర్చుకున్న హర్మన్‌కు సియట్ నిర్వాహకులు భారీగానే ముట్టచెప్పినట్టు సమాచారం. ఇప్పటికే పురుష క్రికెటర్లు రోహిత్ శర్మ, రహానె, ఝార్ఖండ్‌కు చెందిన 19ఏళ్ల క్రికెటర్ ఇషాన్ కిషన్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

సచినే స్టేడియంకు వచ్చి:
మరికొద్ది రోజుల్లో భారత మహిళా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. హర్మన్‌ప్రీత్ ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుతో వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సందర్భంగా ముంబైలో భారత మహిళా జట్టును మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కలిశాడు. వారితో కాసేపు ముచ్చటించి సఫారీ పర్యటనలో సంగతులను ముచ్చటించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications