క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో ఆటగాడు మృతి (వీడియో)
Viral Video: ఈ రోజుల్లో గుండెపోటు కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్ననే(శనివారం) నటి షెఫాలీ జరీవాలా 42 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. షెఫాలీ మరణంతో సినీ పరిశ్రమను విషాదం అలుముకుంది. తాజాగా క్రికెట్ ఆడుతూ ఓ క్రికెటర్ గుండెపోటుతో మరణించాడు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో మ్యాచ్ ఆడుతుండగానే ఒక ఆటగాడికి గుండెపోటు వచ్చింది. బ్యాటింగ్ చేస్తుండగానే గుండెపోటు రావడంతో మైదానంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
పంజాబ్‌లో జరిగిన ఘటన
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా గురుహర్ సహాయ్ డీఏవీ స్కూల్ మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆ సమయంలో బ్యాటర్ ఒక భారీ సిక్స్ కొట్టాడు. సిక్స్ కొట్టిన తర్వాత బ్యాటర్ పిచ్‌పై కూర్చుండిపోతాడు. ఆ తర్వాత నాన్-స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న అతని సహచర ఆటగాడు పరిగెత్తుకుంటూ అతని వద్దకు వస్తాడు. చూస్తుండగానే బ్యాటర్ పిచ్‌పైనే పడిపోయాడు. దీంతో అక్కడున్న ఆటగాళ్లందరూ ఆ బ్యాటర్ వద్ద పరిగెత్తుకుంటూ వచ్చారు. కొంతమంది అతని చేతులకు మసాజ్ చేస్తే.. మరికొందరు కాళ్లకు మసాజ్ చేశారు. కానీ ఆ బ్యాటర్ గుండెపోటు కారణంగా పిచ్‌పైనే ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడి పేరు హర్‌జిత్
గుండెపోటుతో మరణించిన ఆటగాడి పేరు హర్‌జిత్ సింగ్ అని తెలుస్తోంది. అతను 49 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. మైదానంలో సహచర ఆటగాళ్లు అతడికి సీపీఆర్ చేసి స్పృహలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications