
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. ముఖ్యంగా తెలుగు సినిమాలు, పాటలు, డ్యాన్స్‌లు, డైలాగ్‌లపై వార్నర్ అమితమైన ఆసక్తిని కనబరుస్తుంటాడు. లాక్‌డౌన్ టైంలో తెలుగు పాటలకు తానొక్కడే కాకుండా భార్యతో కలిసి స్టెప్పులేసి అదరగొట్టాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఫ్యాన్స్ వార్నర్‌పై ప్రశంసలు కురిపించారు. సదరు పోస్టులకు లైక్‌లు కొట్టడమే కాకుండా కామెంట్లు చేసి షేర్‌లతో హోరెత్తించారు.
ముఖ్యంగా అల వైకుంఠపురంలోని పాటలకు వార్నర్ భార్యతో కలిసి వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. కొన్ని పాటలలో వార్నర్ పిల్లలు కూడా స్టెప్పులేసి అదరగొట్టారు. అంతేకాకుండా పలు సినిమా డైలాగులలో హిరోల ఫేస్‌ల స్థానంలో తన ఫేస్ పెట్టి అంటే ఫేస్ మార్ఫింగ్ చేసి వార్నర్ వీడియోలు చేశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అల వైకుంఠపురంలోని బుట్టబొమ్మకు సాంగ్ వార్నర్ వేసిన స్టెప్పులు అయితే తెగ ఆకట్టుకున్నాయి.
పలు కారణాలతో కొంత కాలంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దూరంగా ఉంటున్న వార్నర్.. తెలుగు పాటలకు కూడా అంతే దూరంగా ఉన్నాడు. దీంతో అభిమానులు కూడా వార్నర్ లేని లోటును జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే వారి ఎదురు చూపులకు తెర దించుతూ వార్నర్ మళ్లీ వచ్చేశాడు. ఇటీవల తెలుగునాట పుష్ప చిత్రంలోని పుష్పరాజ్ చెప్పిన ఓ డైలాగ్ బాగా పాపులర్ అయింది. దీంతో అదే డైలాగ్‌తో వార్నర్ బాబాయి ఫ్యాన్స్ ముందుకు వచ్చేశాడు. పుష్ప చిత్రంలోని పుష్ప.. పుష్ప రాజ్, నీ అవ్వ తగ్గెదేలే అనే డైలాగ్ చెప్పి వార్నర్ అదరగొట్టాడు.
వెనుక వాయిస్ వస్తుంటే వార్నర్ దానికి తగ్గట్టుగా తనదైన రీతిలో హవభావాలు కనబరిచాడు. దానికి తగ్గట్టుగా లిప్స్ కదిలించి వారెవ్వా.. వార్నర్ బాబాయి అనిపించాడు. ఈ వీడియోను వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇంకేముందు ఆ వీడియోను చూసి ఫ్యాన్స్ ఊరుకుంటారా? లైక్‌లు కొట్టి, కామెంట్స్ చేసి షేర్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇలా చాలా కాలం తర్వాత వార్నర్ మళ్లీ కనిపించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా అచ్చం ఇదే డైలాగ్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా వీడియో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా అల్లు అర్జున్, రష్మిక మందాన హిరో, హిరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది.