న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Axar Patel: బ‌ర్త్‌డే రోజు ప్రియురాలితో టీమిండియా స్టార్ క్రికెట‌ర్ నిశ్చితార్ధం

Cricketer Axar Patel engagement with his girlfriend Meha

టీమిండియా స్టార్ క్రికెట‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ అభిమానుల‌కు త‌న‌ పుట్టిన రోజు గిఫ్ట్ ఇచ్చాడు. గురువారం త‌న 28వ పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకున్న అక్ష‌ర్ ప‌టేల్‌.. దాంతోపాటే త‌న ప్రియురాలితో నిశ్చితార్ధం కూడా జ‌రుపుకున్నాడు. తన చిన్న‌నాటి స్నేహితురాలు మేహాతో కొంత కాలంగా ప్రేమ‌లో ఉన్న అక్ష‌ర్ ప‌టేల్ తాజాగా ఆ బంధాన్ని పెళ్లి పీట‌లు ఎక్కించే దిశ‌గా అడుగులు వేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే శుక్ర‌వారం త‌న పుట్టిన రోజుల వేడుక‌ల‌తోపాటు పెద్ద‌ల స‌మ‌క్షంలో మేహాతో నిశ్చితార్ధం కూడా జ‌రుపుకున్నాడు.

ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ల‌లో అధికారికంగా ప్ర‌క‌టించాడు. అంతేకాకుండా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో "ఈ రోజు మ‌న కొత్త జీవితానికి ప్రారంభం.. నిన్ను ఎప్పటీకీ ప్రేమిస్తుంటాను" అని రాసుకొచ్చాడు.

ఈ మేర‌కు త‌న ఇన్‌స్టాగ్రామ్, ట్విట్ట‌ర్‌ ఖాతాల‌లో ప్రియురాలు మేహాతో క‌లిసి ఉన్న 4 ఫోటోల‌ను అక్ష‌ర్ ప‌టేల్ షేర్ చేశాడు. ఈ ఫోటోలు అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటున్నాయి. దీంతో ప్ర‌స్తుతం అక్ష‌ర్ ప‌టేల్, మేహా ఫోటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఒక ఫోటోలో న‌న్ను పెళ్లి చేసుకో అని అక్ష‌ర్ ప‌టేల్.. మేహాను అడుగుతున్న‌ట్లు రాసి ఉండ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. అలాగే అందులో పెద్ద ఆకారంలో ఉన్న ల‌వ్ సింబ‌ల్ ఆక‌ట్టుకుంటుంది. అన్ని ఫోటోల్లో ఈ కొత్త జంట క‌ల‌ర్‌ఫుల్‌గా కనిపిస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.

దీంతో టీమిండియా ఆట‌గాళ్ల‌తోపాటు అభిమానులు ఈ కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ఇప్ప‌టికే అక్ష‌ర్ ప‌టేల్ తోటి స్పిన్న‌ర్ అయిన య‌జుర్వేంద్ర చాహ‌ల్ ఈ కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు చెప్పగా ఇత‌ర క్రికెట‌ర్లు కూడా చెబుతున్నారు. అక్ష‌ర్ ప‌టేల్ ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్ ఖాతాలోని కామెంట్స్ బాక్స్‌లు కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ నిండిపోయాయి.

ప్ర‌స్తుతం అక్ష‌ర్ ప‌టేల్ గాయం కార‌ణంగా సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో 5 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అక్ష‌ర్ ప‌టేల్ 36 వికెట్లు తీశాడు. అత్య‌ధికంగా ఓ ఇన్నింగ్స్‌లో 6, మ్యాచ్‌లో 11 వికెట్లు తీశాడు. 38 వ‌న్డే మ్యాచ్‌ల్లో 45 వికెట్లు తీశాడు. ఓ వ‌న్డేలో అత్య‌ధికంగా 3 వికెట్లు తీశాడు. ఇక 15 టీ20 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. అత్య‌ధికంగా ఓ మ్యాచ్‌లో 3 వికెట్లు తీశాడు. అలాగే ఐపీఎల్‌లో 109 మ్యాచ్‌లు ఆడి 95 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అత్య‌ధికంగా ఓ మ్యాచ్‌లో 4 వికెట్లు తీశాడు.

Story first published: Friday, January 21, 2022, 11:29 [IST]
Other articles published on Jan 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X