For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాలీవుడ్‌లోకి మరో క్రికెటర్: మల్లికా షరావత్‌తో మాటా మంతీ

వెస్టిండిస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో బాటలోనే మరో వెస్టిండిస్ క్రికెటర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించాడు. ఇంతకీ ఎవరా క్రికెటర్‌ అనుకుంటున్నారా?

By Nageshwara Rao

హైదరాబాద్: వెస్టిండిస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో బాటలోనే మరో వెస్టిండిస్ క్రికెటర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించాడు. ఇంతకీ ఎవరా క్రికెటర్‌ అనుకుంటున్నారా? మరెవరో కాదు వెస్టిండీస్‌ క్రికెటర్ ఆండ్రూ రస్సెల్. బాలీవుడ్‌లో అరంగేట్రంపై ఇప్పటికే మల్లికా షరావత్‌ను కలిసి సలహాలు, సూచనలు తీసుకున్నానని చెప్పాడు.

వాడా(వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ) నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఆండ్రూ రసూల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమైన సంగతి తెలిసిందే. 12 నెలల్లో మూడుసార్లు డోపింగ్‌ పరీక్షకు హాజరవ్వాల్సిందిగా సూచించినప్పటికీ, అతను హాజరుకాకపోవడంతో వాడా అతడిపై నిషేధాన్ని విధించింది.

Cricketer Andre Russell Planning To Enter Bollywood

దీంతో రస్సెల్‌పై ఏడాది పాటు ఐసీసీ నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఓ ఇంటర్నేషనల్‌ మ్యాజిక్‌ వీడియోను విడుదల చేయడానికి ప్లాన్‌ చేసుకున్న రస్సెల్‌.. బాలీవుడ్‌పై తనకున్న ఆసక్తిని ఇటీవలే బయటపెట్టాడు. టెక్సాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రసూల్ మీడియాతో మాట్లాడాడు.

'ప్రస్తుతం క్రికెట్‌ ఆడట్లేదు. నాకు పాటలు పాడటం, డ్యాన్స్‌ చేయడం అంటే ఇష్టం. జమైకన్లు సంగీతాన్ని ఇష్టపడతారు. సహచర ఆటగాడు డ్వేన్‌ బ్రావో నుంచి మ్యూజిక్‌ పాఠాలు నేర్చుకున్నాను. నా మొదటి మ్యూజిక్‌ వీడియో ఆల్బమ్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తాను. కానీ నా దృష్టి మాత్రం భారత్‌పైనే. అన్నీ అంశాలు కలిసొస్తే బాలీవుడ్‌లో నటించే అవకాశం ఉంది.' అని అన్నాడు.

Cricketer Andre Russell Planning To Enter Bollywood

జస్టిన్‌ బీబర్‌ గ్రామీ అవార్డ్‌ విన్నింగ్‌ ఆల్బమ్ 'సారీ' కి ప్రొడక్షన్‌ హౌస్‌గా ఉన్న సంస్థనే రస్సెల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ను ప్రొడ్యూస్‌ చేస్తోంది. ఇదిలా ఉంటే డ్వేన్‌ బ్రావో ఇప్పటికే 'ఛాంపియన్‌', 'ట్రిప్‌ అబీ బాకీ హై' లాంటి మ్యూజిక్‌ వీడియోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+